Abn logo
Oct 21 2021 @ 02:35AM

బీఎస్‌ఎన్‌ఎల్‌కు జీఎక్స్‌ మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ లైసెన్స్‌

న్యూఢిల్లీ : ప్రయాణికులకు విమానాలు, ఓడల్లో హైస్పీడ్‌ కనెక్టివిటీ అందించేందుకు దోహదపడే గ్లోబల్‌ ఎక్స్‌ప్రెస్‌ (జీఎక్స్‌) మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల నిర్వహణకు తమ వ్యూహాత్మక భాగస్వామి బీఎ స్‌ఎన్‌ఎల్‌కు లైసెన్సు లభించిందని ఇన్మార్‌శాట్‌ ప్రకటించింది. టెలికాం శాఖ అందించిన బీఎ్‌సఎన్‌ఎల్‌ ఇన్‌ఫ్లైట్‌ అండ్‌ మారిటైమ్‌ కనెక్టివిటీ (ఐఎ్‌ఫఎంసీ) లైసెన్స్‌తో భారత్‌ మీదుగా ప్రయాణించే దేశీయ, అంతర్జాతీయ విమానాలు, ఓడల్లోని ప్రయాణికులు బ్రాండ్‌బ్యాండ్‌ సేవలు అందుకోగలుగుతారని వెల్లడించింది. కాగా ఈ సేవలు ఉపయోగించుకునేందుకు స్పైస్‌జెట్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రభుత్వానికి, ఇతర యూజర్లకు కూడా బీఎ్‌సఎన్‌ఎల్‌ తదుపరి దశలో జీఎక్స్‌ మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు అందించే వీలుంటుంది.