Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొత్త ప్లాన్‌ను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. బీఎస్ఎన్ఎల్ రూ. 1,999తో సంవత్సర ప్రీపెయిడ్ ప్లాన్‌‌ను ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ పీవీ1999 ప్లాన్‌తో మార్చి 31లోపు రీఛార్జీ చేసుకుంటే 395 రోజుల వరకు ఫోన్ కాల్స్, డేటాను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.


బీఎస్ఎన్ఎల్ పీవీ1999 ప్రీపెయిడ్ ప్లాన్ ఇది సాధారణంగా 365 రోజుల చెల్లుబాటు అవుతుండగా, బీఎస్ఎన్ఎల్ పీవీ1999 ప్లాన్‌తో మార్చి 31 లోపు రీఛార్జ్ చేస్తే 395 రోజుల వరకు అపరిమిత ఫోన్ కాల్స్, ప్రతి రోజు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. ఈ ఆఫర్ మార్చి 2న ప్రారంభమైందని, ఈ ప్లాన్ అన్ని సర్కిళ్లలో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ చాలా సందర్భాలలో సవరించింది, చాలా వరకు ఇటీవల జనవరిలో డేటాను రోజుకు 3జీబీ నుంచి రోజుకు 2జీబీకి తగ్గించబడిందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

Advertisement
Advertisement