బీఎస్ఎన్ఎల్ రిపబ్లిక్ డే స్పెషల్ ఆఫర్.. ఇక నుంచి అన్‌లిమిటెడ్ కాల్స్‌..

ABN , First Publish Date - 2021-01-26T22:20:23+05:30 IST

రిపబ్లిక్ డే స్పెషల్ ఆఫర్‌లో భాగంగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్)... రూ . 699 ప్రీపెయిడ్ ప్లాన్‌ను మరిన్ని టెలికాం సర్కిళ్ళలో అందుబాటులోకి తెచ్చింది.

బీఎస్ఎన్ఎల్ రిపబ్లిక్ డే స్పెషల్ ఆఫర్.. ఇక నుంచి అన్‌లిమిటెడ్ కాల్స్‌..

న్యూఢిల్లీ : రిపబ్లిక్ డే స్పెషల్ ఆఫర్‌లో భాగంగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్)... రూ . 699 ప్రీపెయిడ్ ప్లాన్‌ను మరిన్ని టెలికాం సర్కిళ్ళలో అందుబాటులోకి తెచ్చింది. కిందటి సంవత్సరుం మే నెలలో బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌ను  ప్రవేశపెట్టింది. తొలుత దీనినికొన్ని స‌ర్కిళ్ల ప‌రిధిలో మాత్రమే అమలు చేయగా, ఈ రోజు(జనవరి 26) నుండి అన్ని స‌ర్కిళ్ళలో కూడా అందుబాటులోకి తెచ్చింది. మరికొన్ని వివరాలిలా ఉన్నాయి.


బిఎస్‌ఎన్‌ఎల్ తన రూ .699 ప్రీపెయిడ్ ప్లాన్ ను పొడిగించింది. ఈ క్రమంలో... ఈ ప్లాన్ ఇప్పటివరకు అందుబాటులో లేని కేరళ సర్కిల్‌లో కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు రోజువారీ 0.5జీబీ హై-స్పీడ్ డేటాను పొందగలుగుతారు, ఆ


తరువాత వేగం 80 కేబీపీఎైస్ కు తగ్గుతుంది. ఇక 160 రోజుల సుదీర్ఘ వాలిడిటీ ఉంటుంది. డేటా అంత‌గా అవ‌స‌రం లేకుండా ఎక్కువ కాల్స్ చేయాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ చాలా అనువుగా ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2021-01-26T22:20:23+05:30 IST