Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 18 2021 @ 09:54AM

23న మాయావతి ఆధ్వర్యంలో బీఎస్పీ బ్రాహ్మణ సమ్మేళనం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలకు ముందుగానే బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయవతి పలు సామాజికవర్గాలను తమ పార్టీవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా  ఈనెల 23న అయోధ్యలో బ్రాహ్మణ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బాధ్యతలను పార్టీ నేత సతీష్ చంద్రమిశ్రాకు అప్పగించారు. ఈ నెల 23 నుంచి 29 వరకూ యూపీలోని ఆరు జిల్లాలలో బ్రాహ్మణ సమ్మేళనాలను నిర్వహించనున్నారు. 

2007లో మాయవతి బ్రాహ్మణ సమ్మేళనాలను నిర్వహించి, ఆ వర్గం వారిని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఈసారి కూడా అదే ఫార్ములాను అనుసరించాలనే ఉద్దేశంతో రాప్ట్రవ్యాప్తంగా 200కుపైగా బ్రాహ్మణ సమ్మేళనాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దళిత, బ్రాహ్మణ, ఓబీసీ ఫార్ములాతో మాయావతి 2022లో ఎన్నికల్లో తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. 2007 ఎన్నికల్లో మాయావతి అధిక సంఖ్యలో బ్రాహ్మణులకు టిక్కెట్లు కేటాయించారు. ఈ ఫ్రయత్నం ఫలించి అప్పట్లో మాయావతి సర్కారు అధికారంలోకి వచ్చింది.

Advertisement
Advertisement