Advertisement
Advertisement
Abn logo
Advertisement

బతుకమ్మ పాటలతో ఆడిపాడిన మహిళా ఉద్యోగులు

హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు రాష్ట్రమంతా ఘనంగా జరుగుతున్నాయి. మహిళలు,యువతులు ఇండ్ల ముందు రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి అందులో గౌరమ్మను ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో  టలు పాడడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నెల 7వ తేదీన జరిగిన ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. చివరి రోజున సద్దుల బతుకమ్మ భారీగా నిర్వహిస్తారు.


కేవలం మహిళలు కాలనీలు, బస్తీల్లోనే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడుతున్నారు. శుక్రవారం తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బి.ఆర్.కె.ఆర్ భవన్ లో బతుకమ్మ వేడుకలు పెద్ద ఎత్తున జరిగాయి. వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది హోదాలను పక్కనబెట్టి భక్తి, శ్రద్ధలతో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ బతుకమ్మ వేడుకల నిర్వహణను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 

Advertisement
Advertisement