Abn logo
Aug 2 2020 @ 18:31PM

‘నేనే రాజీనామా చేశా.. వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు చేయరు?’

అమరావతి : మూడు రాజధానుల బిల్లుపై ఏపీ గవర్నర్ మద్దతును వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా అనంతరం ఆయన అమరావతికి వెళ్లనున్నారు. రేపు ఉదయం 11గంటలకు తుళ్లూరులోని రాజధాని రైతుల శిబిరానికి వెళ్లనున్నారు. రాయలసీమ నుంచి తానే రాజీనామా చేశానని.. అలాంటిది రాజధాని ఉండే గుంటూరు, కృష్ణా జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయరు..? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. 


అయితే.. మూడు రాజధానులపై పులివెందులలోనే వ్యతిరేకత ఉందని రవి చెబుతున్నారు. స్పీకర్ ఫార్మాట్‌లో రేపు తన రాజీనామా పత్రాన్ని తుళ్లూరు శిబిరంలో తయారుచేసి ఛైర్మన్‌కు పంపాలని ఆయన భావిస్తున్నారు. రేపు ఉదయమే పులివెందుల నుంచి తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి రవి అమరావతికి చేరుకోనున్నారు. అనంతరం స్థానిక టీడీపీ నేతలు, రాజధాని రైతులతో కలిసి మాట్లాడి నిరసనలో పాల్గొనన్నారని తెలుస్తోంది.

Advertisement
Advertisement
Advertisement