Abn logo
Nov 22 2020 @ 15:18PM

అడ్వాన్స్‌ వెనక్కిచ్చేసిన డైరెక్టర్‌..?

Kaakateeya

ఓ డైరెక్టర్‌ లవ్‌స్టోరిని తెరకెక్కించాడు. కోవిడ్‌ పుణ్యమాని ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. అయితే ఆ సినిమా పాటలు మాత్రం బ్లాక్‌బస్టర్ అయ్యాయి. దీంతో సదరు డైరెక్టర్‌తో సినిమా చేయడానికి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ అప్రోచ్‌ అయ్యి డెబ్బై లక్షల రూపాయలు అడ్వాన్స్‌ కూడా ఇచ్చింది. అయితే ముందు ఓకే చెప్పినప్పటికీ, అగ్రిమెంట్‌ కారణంగా ఆ డైరెక్టర్‌ మూడో సినిమాను చేస్తానని చెప్పినా కూడా అడ్వాన్స్‌ ఇచ్చిన సంస్థ ఒప్పుకోకపోవడంతో ఇచ్చిన డెబ్బై లక్షల రూపాయల అడ్వాన్స్‌ను వెనక్కి ఇచ్చేశాడట డైరెక్టర్‌. ఇంతకు ఆ డైరెక్టర్‌ ఎవరో కాదు. బుచ్చిబాబు సానా. ఈయన తెరకెక్కించిన సినిమా ఉప్పెన ఇంకా విడుదల కాలేదు కానీ.. పాటలు బ్లాక్‌బస్టర్‌ కావడంతో ఈయనతో నెక్ట్స్‌ మూవీ చేయడానికి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అడ్వాన్స్‌ ఇచ్చింది. కానీ అగ్రిమెంట్‌ ప్రకారం మైత్రీ మూవీ మేకర్స్‌తోనే రెండో సినిమా చేయాల్సి రావడంతో.. సితారలో మూడో సినిమా చేస్తానని బుచ్చిబాబు అన్నాడు. కానీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఒప్పుకోలేదు దీంతో బుచ్చిబాబు తీసుకున్న అడ్వాన్స్‌ను వెనక్కి ఇచ్చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వైష్ణవ్‌తేజ్‌, క్రితిశెట్టి జంటగా నటించిన ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించాయి. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహించారు. 


Advertisement
Advertisement