‘మే 23.. రాష్ట్రానికి శని పట్టిన రోజు’

ABN , First Publish Date - 2020-05-23T21:58:28+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘మే 23 అంటే రాష్ట్రానికి శని పట్టిన రోజు, రాక్షసులు పండుగ చేసుకునే రోజు, అభివృద్ధి కోరుకునే వాళ్లు బాధపడే రోజు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘మే 23.. రాష్ట్రానికి శని పట్టిన రోజు’

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘మే 23 అంటే రాష్ట్రానికి శని పట్టిన రోజు, రాక్షసులు పండుగ చేసుకునే రోజు, అభివృద్ధి కోరుకునే వాళ్లు బాధపడే రోజు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. గత ఏడాది ఇదే రోజున జగన్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని దోచుకునేందుకు లైసెన్స్ వచ్చిన రోజు అని వ్యాఖ్యానించారు. ఉచిత ఇసుకను దోచుకోవడానికి 4 నెలలు ఆపేసి.. 60 మంది కూలీల ప్రాణాలు తీసి, 40 లక్షల మంది కార్మికులు ఆకలితో విలవిల్లాడేలా చేసిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. జగన్‌కు ముఖ్యమంత్రి పదవి అంటే పిచ్చోడి చేతిలో రాయిలింటిదేనని వ్యాఖ్యానించారు. జగన్‌కు విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనే నాలుగు దుష్ట గ్రహాలు ఉన్నాయని బుద్దా వెంకన్న ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జే ట్యాక్స్‌కు భయపడి రాష్ట్రంలో స్థాపించడానికి ఒక్క కొత్త పరిశ్రమ కూడా ముందుకు రావడం లేదన్నారు. పారిశ్రామికవేత్తలు గడగడలాడుతున్నారని అన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి అవసరమా? అని ప్రజలు ఆలోచించుకోవాలని వెంకన్న కోరారు. జగన్ అంటే దేశ ప్రజలకు తెలిసేలా లేదని, వసూలు రాజా అంటే తెలిసేలా ఉందని విమర్శలు గుప్పించారు. గతంలో జగన్‌కు పాలాభిషేకం చేసినవాళ్లు నేడు తాగడానికి నీళ్లు లేవని మొరపెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. జగన్ చర్యలు చూసి ఆయనకు ఓట్లు వేసిన వాళ్లే బాధపడుతున్నారని బుద్దా వెంకన్న చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-05-23T21:58:28+05:30 IST