Abn logo
Sep 28 2021 @ 14:37PM

జగన్‌రెడ్డికి కుల పిచ్చి బాగా ముదిరింది: బుద్దా వెంకన్న

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి కులపిచ్చి బాగా ముదిరిపోయిందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కేవలం 4 శాతమున్న తన వర్గానికే పదవులన్నీ కట్టబెడుతున్నారని ఆరోపించారు. గతంలో స్పీకర్ తమ్మినేని సీతరాం రెడ్డివారే.. తమకు దొడ్డవారన్న మాటలను.. జగన్‌రెడ్డి తూచా తప్పకుండా పాటిస్తున్నారన్నారు. అన్ని వర్గాల ఓట్లతోనే సీఎం అయ్యారనే వాస్తవాన్ని జగన్ విస్మరిస్తున్నారన్నారు. రెడ్లను తప్ప.. మరో వర్గాన్ని నమ్మనట్లుగా ముఖ్యమంత్రి ప్రవర్తన ఉందన్నారు. వర్గాలకు దూరంగా ఉండే చంద్రబాబుకు కుల పిచ్చి ఉందని దుష్ప్రచారం చేసి.. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారన్నారు. ఇవాళ సీఎం దగ్గరుండే గుమస్తా మొదలు ప్రభుత్వ సలహాదారుల వరకు..అన్ని పదవులు తన వర్గానికే ఇస్తున్నారని బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విమర్శించారు.

ఇవి కూడా చదవండిImage Caption