Abn logo
Sep 20 2021 @ 11:44AM

వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు పిచ్చి: బుద్దా వెంకన్న

విజయవాడ: టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఒక వినతి పత్రమిస్తామన్నారు. ‘అయ్యా అమరావతిలో మనం అన్నింటికి ఓకే చేద్దామనుకున్నాం.. కానీ ఒక వంద ఎకరాల్లో పిచ్చాసుపత్రి కూడా కట్టాలని, ఎందుకంటే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. చాలామందికి పచ్చిక్కెందని, వాళ్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈ పిచ్చోలందరినీ ఆస్పత్రిలో చర్పించి చికిత్స అందించాలని, అది మన కర్తవ్యమని’ చంద్రబాబును కోరతామని బుద్దా వెంకన్న అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption