బడ్జెట్... బడ్జెట్... పీపీఎఫ్​‌లో వార్షిక పెట్టుబడిపై పెట్టుబడిదారులు కోరుకుంటున్నారు ?

ABN , First Publish Date - 2022-01-27T01:41:48+05:30 IST

చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఎక్కువగా ఆదరణ పొందిన వాటిల్లో ఒకటైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్​)... పెట్టుబడి పెట్టడం ద్వారా అసలుతో పాటు, వడ్డీపై కూడా పన్ను మినహాయింపును పొందవచ్చన్న విషయం తెలిసిందే.

బడ్జెట్... బడ్జెట్... పీపీఎఫ్​‌లో వార్షిక పెట్టుబడిపై  పెట్టుబడిదారులు కోరుకుంటున్నారు ?

న్యూఢిల్లీ : చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఎక్కువగా ఆదరణ పొందిన వాటిల్లో ఒకటైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్​)... పెట్టుబడి పెట్టడం ద్వారా అసలుతో పాటు, వడ్డీపై కూడా  పన్ను మినహాయింపును పొందవచ్చన్న విషయం తెలిసిందే. కాగా... త్వరలో తెరమీదకు రానున్న బడ్జెట్ నేపధ్యంలో... పీపీఎఫ్​లో వార్షిక పెట్టబడి పరిమితి పెంపు ప్రధాన డిమాండ్​గా వినిపిస్తోంది. మారుతున్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం, కొవిడ్ నేపథ్యంలో పెరిగిన అవసరాల దృష్ట్యా పరిమితి పెంపు ఉండాలని మదుపరులు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి బడ్జెట్​లో ప్రకటన చేయాల్సిందిగా ఆర్ధికవేత్తలు కూడా కేంద్రానికి సూచిస్తున్నారు.


పన్ను మినహాయింపు పెంచాలి...! 

పీపీఎఫ్​లో వార్షిక పెట్టుబడి మొత్తం పరిమితి పెంచడం సహా.. పన్ను మినహాయింపు కూడా పెంచాలని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పెట్టుబడి పరిమితి అయిన రూ. 1.5 లక్షలపై ఆదాయాపు పన్ను చట్టం 80 సీ ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తోంది. కాగా... కేంద్రం ఈ దఫా బడ్జెట్​లో పెట్టుబడి పరిమితిని రూ. 3 లక్షలకు పెంచినపక్షంలో... పన్ను మినహాయిపు పరిమితి కూడా రూ. 3 లక్షలకు పెంచాలన్న డిమాండ్లు ఈ సందర్బంగా వినవస్తున్నాయి. తద్వారా  సామాన్యులకు ఈ పథకం ద్వారా అందే ప్రతిఫలాలు పూర్తిగా లభిస్తాయని చెబుతున్నారు.


పెట్టుబడితో పాటు పన్ను పరిమితి పెంచితే... 

ఈ దఫా బడ్జెట్​లో చపీపీఎఫ్​ పెట్టుబడి పరిమితితో పాటు పన్ను మినహాయింపు పెరిగినపక్సంలో... సామాన్యుల ఆదాయం కూడా భారాగా పెరిగే అవకాశముంటుందని చెబుతున్నారు. సాధారణంగా పీపీఎఫ్ మెచ్యూరిటీ పదిహేనేళ్ళు.   ప్రతి ఏటా ప్రస్తుత గరిష్ఠమైన రూ. 1.50 లక్షల జమ చేసుకుంటూ వెళ్ళినపక్షంలో(7.1 శాతం వడ్డీతో)...  మెచ్యూరిటీ సమయానికి రూ. 4,068,209 పొందొచ్చు. ఇందులో రూ. 2,250,000 లక్షలు అసలు కాగా.. రూ. 1,818,209 వడ్డీ. మెచ్యూరిటీ సమయాన్ని ఐదేళ్ల చొప్పున పెంచుకునే వెసులుబాటు ఉన్నందున.. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశముంటుంది.


కాగా రానున్న బడ్జెట్‌లో ఈ పరిమితిని రూ. 3 లక్షలకు పెంచినపక్షంలో... 7.1 శాతం వడ్డీ రేటు వద్దే.. పదిహేనేళ్ళ తర్వాత రూ. 8,136,418 లను పొందవచ్చు. ఇందుకుగాను ఆదాయాపు పన్ను చట్టాల్లో కూడా మార్పులు అవసరమని నిపుణులు అంటున్నారు. మరి కేంద్రం దీనిపై ప్రకటన చేస్తుందా ? లేదా ? అన్నది ఫిబ్రవరి ఒకటినే తేలనుంది. 

Updated Date - 2022-01-27T01:41:48+05:30 IST