బడ్జెట్‌ అంచనాల కంటే ఎక్కువ అప్పు చేసింది వాస్తవమే: బుగ్గన

ABN , First Publish Date - 2021-03-05T22:23:35+05:30 IST

బడ్జెట్‌ అంచనాల కంటే ఎక్కువ అప్పు చేసింది వాస్తవమేనని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

బడ్జెట్‌ అంచనాల కంటే ఎక్కువ అప్పు చేసింది వాస్తవమే: బుగ్గన

అమరావతి: బడ్జెట్‌ అంచనాల కంటే ఎక్కువ అప్పు చేసింది వాస్తవమేనని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా రాబడి తగ్గిందని, ఖర్చు విపరీతంగా పెరిగిందని తెలిపారు. ఆదాయం లేకున్నా ప్రజలకు ఖర్చుచేసి ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. గతేడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో దాదాపూ ప్రతిరోజూ.. కరోనా నియంత్రణ చర్యల కోసం రూ. వందలకోట్లు వెచ్చించాల్సి వచ్చిందని బుగ్గన పేర్కొన్నారు. కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ తెచ్చుకోగలిగామని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.


ఆర్థిక సంక్షోభం దిశగా ఏపీ వెళ్తొందని కాగ్ రిపోర్టు తేల్చిన విషయం తెలిసిందే. రాష్ట్రం పదినెలలకు తీసుకున్న రుణం రూ. 73913 కోట్లకు చేరిందని నివేదికలో కాగ్ పేర్కొంది. బడ్జెట్‌లో అంచనా రూ.48295 కోట్లు కాగా.. ఇది అంచనాకన్నా 153 శాతం ఎక్కువ అని తెలిపింది. ఇక రెవెన్యూ లోటు పెరిగిపోతోందని, ఇది 300 శాతం అధికమని కాగ్ అంటోంది. బడ్జెట్‌లో రెవెన్యూ లోటు అంచనా రూ.18, 434 కోట్లు ఉండగా.. అసలు రెవెన్యూ లోటు రూ.54,046 కోట్లు ఉందని రిపోర్టులో ప్రస్తావించింది. రెవెన్యూ రాబడి పెరిగినా సంక్షేమ కార్యక్రమాలతో అప్పుల ఊబిలో ఏపీ చిక్కుకుంది. గతేడాది జనవరి నెలాఖరు వరకు అప్పులు రూ.46,503 కోట్లు తీసుకుందని, బహిరంగ మార్కెట్‌ రుణాల సేకరణలో ఏపీకి దేశంలో 4వ స్థానంలో ఉందని కాగ్ తెలిపింది.

Updated Date - 2021-03-05T22:23:35+05:30 IST