Abn logo
Aug 7 2020 @ 17:21PM

బఫెట్‍ సోదరి ఇకలేరు...

రాకపోర్ట్‌మైన్ : ప్రముఖ వ్యాపారవేత్త వారెన్ బఫెట్ సోదరి డోరిస్‍ బఫెట్‍  మృతి చెందారు. రాక్‍పోర్ట్ మైన్‍లో ఉన్న తన ఇంటిలోనే ఆమె తుదిశ్వాస విడిచారు. డోరీ(92) మృతితో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది.


ఆమె కుమారుడు అలెగ్జాండర్‍ బఫెట్‍ రోజెక్‍ మాట్లాడుతూ బిల్లీ హాలిడే మ్యూజిక్‍ వింటూనే తన తల్లికన్నుమూసినట్లు తెలిపారు. ఉదార దాతగా పేరున్న డోరీ తన సోదరుడు వారెన్‍ బఫెట్‍కు సహాయకారిగా ఉన్నారు.


బఫెట్‍... ప్రజల జీవనశైలిని సైతం మార్చేలా బహుమానాలు ఇవ్వడం వెనుక డోరీ ప్రమేయం ఉందని ఇప్పటికీ చెబుతారు. వందలాదిగా తన సోదరునికి వచ్చే లేఖలను ఆమె పరిశీలించి కొంతమేర సాయం చేస్తారు.


విరాళాలనిచ్చే క్రమంలో కూడా ఆమె... గ్రహీతలను ఎంపిక చేసుకునే విధానంలో జాగ్రత్తలను పాటిస్తారు. స్వార్థ్యంతో వచ్చే వినతులను తిరస్కరించి, మొత్తం విజ్ఞప్తులను క్రోడీకరించి ఎంపిక చేసేవారని ఆమెకు పేరుంది. 

Advertisement
Advertisement
Advertisement