సర్వీస్ రోడ్లు నిర్మించండి: హైకోర్టు

ABN , First Publish Date - 2021-09-05T03:12:06+05:30 IST

బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌కు రెండు వైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాలని జాతీయ రహదారుల

సర్వీస్ రోడ్లు నిర్మించండి: హైకోర్టు

అమరావతి: బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌కు రెండు వైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాలని జాతీయ రహదారుల సంస్థను హైకోర్టు ఆదేశించింది. 10 మీటర్ల  వెడల్పుతో సర్వీస్ రోడ్లు నిర్మించాలని ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై డివిజినల్ బెంచిలో జాతీయ రహదారుల సంస్థ రిట్‌ పిటిషన్‌ వేసింది. రిట్‌ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. సర్వీస్‌ రోడ్లను నిర్మించాల్సిన బాధ్యత జాతీయ రహదారుల సంస్థదేనని హైకోర్టు చెప్పింది. వెంటనే సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. 

Updated Date - 2021-09-05T03:12:06+05:30 IST