Abn logo
Sep 20 2021 @ 22:52PM

భవన నిర్మాణ కార్మికుల ధర్నా

తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు, సీఐటీయూ నేతలు

సూళ్లూరుపేట, సెప్టెంబరు 20 :  జగనన్న బీమా కింద  దారిమళ్లించిన రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నిధులు రూ. 450 కోట్లను సంక్షేమ బోర్డుకు సీఎం జమచేయాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు సోమవారం ధర్నా చేశారు. స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నినాదాలు చేసి తహసీల్దారు రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో రూ. 4 కోట్ల చెల్లింపులు  ఆపేశారని, భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపుకార్డులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులకు 10వేలు సాయంగా అందజేయాలని, ఇసుక ట్రక్కు రూ. 3వేలకే అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సాంబశివయ్య, ఉపాధ్యక్షుడు మునస్వామిరెడ్డి, సీఐటీయూ నేత పద్మనాభయ్య, రాఘవయ్య, చంద్రయ్య, సత్యం, తదితరులు పాల్గొన్నారు.