Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏకలవ్య గురుకుల భవన పనులు త్వరగా పూర్తి చేయాలి

- విద్యాప్రమాణాలు పెంచేందుకు పాఠ్య ప్రణాళికలు రూపొందించాలి

 -  కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) :  ఏకలవ్య గురుకుల పాఠశాల భవనం తుది దశ ప నులను 15రోజుల్లో పూర్తి చేసి తరగతులు నిర్వ హించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌ కుమార్‌ కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. మంగళవారం ఏకలవ్య గురుకుల పాఠశాల భవన నిర్మాణం, ప్రస్తు తం జడ్చర్లలో కొనసాగుతున్న విద్యార్థుల తరగతుల పై తన ఛాంబర్‌లో కలెక్టర్‌  సంబంధిత అధికారుల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మంచి చదువులు అందించి, వారి జీవితాల్లో ఆర్థిక, సామాజిక మార్పులు తేవడానికి ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన ఏకలవ్య గురు కుల పాఠశాల భవనాన్ని వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో పది ఎకరాల స్థలంలో రూ. 12కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పూర్తైన నిర్మాణ పనుల వివరాలు అధికారులు, కాంట్రాక్టర్‌తో అడిగి తెలుసుకున్నారు. ఏకలవ్య గురుకుల పాఠశాల లో ఆరవ తరగతి నుంచి 9వ తరగతి వరకు 240మంది విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణంలో కొనసాగు తున్నందున విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉం చుకొని నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశిం చారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు పడిపోయినందున వి ద్యార్థి తరగతిని బట్టి విద్యాప్రమాణాలు పెంచేందు కు ఢిల్లీ తరహాలో పాఠ్య ప్రణాళికలు రూపొందించి నిర్వహించాలని ఆదేశించారు. గురుకులాల్లో విద్యార్థు ల ఆరోగ్య పరీక్షల నిర్వహించే ఏఎన్‌ఎంలు , ఆర్‌సీవో తన పరిధిలోని పాఠశాలను తనిఖీ చేయా లని ఆదేశించారు. ఏకలవ్య పాఠశాల అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకులాల ప్రిన్సిపాల్స్‌ తో త్వరలోనే  సమావేశం నిర్వహించనున్నట్లు కలె క్టర్‌ వెల్లడించారు.   కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు నాగార్జునరావు, ఏకలవ్య పాఠశాలల ప్రిన్సిపాల్‌ సరస్వతి, గిరిజన సంక్షేమ శాఖ డీఈ వెంకటేశ్వరసింగ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ వెంకట నారాయణ, కాంట్రాక్టర్‌ వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు.

Advertisement
Advertisement