అనుమతి లేకుండా భవనాలు నిర్మిస్తే కూల్చేస్తాం

ABN , First Publish Date - 2021-06-18T05:07:40+05:30 IST

కార్పొరేషన్‌ పరిధిలో సిటీ ప్లానింగ్‌ అనుమతులు లేకుండా వాణిజ్య, నివాస భవనాలు నిర్మిస్తే కూల్చేస్తామని ఏసీపీ నాగేంద్ర హెచ్చరించారు. చిత్తూరు నుంచి బదిలీపై వచ్చిన ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు.

అనుమతి లేకుండా భవనాలు నిర్మిస్తే కూల్చేస్తాం
ఏసీపీ నాగేంద్ర

కడప, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): కార్పొరేషన్‌ పరిధిలో సిటీ ప్లానింగ్‌ అనుమతులు లేకుండా వాణిజ్య, నివాస భవనాలు నిర్మిస్తే కూల్చేస్తామని ఏసీపీ నాగేంద్ర హెచ్చరించారు. చిత్తూరు నుంచి బదిలీపై వచ్చిన ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. రహదారులు, కాల్వలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా సహించేది లేదన్నారు. అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు కొని మోసపోవద్దని సూచించారు. అటువంటి లేఅవుట్లను రిజిస్ట్రేషన్‌ చేయవద్దంటూ రిజిస్ట్రేషన్‌ శాఖకు లేఖ రాస్తామన్నారు. 

Updated Date - 2021-06-18T05:07:40+05:30 IST