తరతరాలకు చెదరని కట్టడాలు

ABN , First Publish Date - 2020-07-11T09:20:03+05:30 IST

ఒక ప్రాంతం నుంచి మరో చోటికి రాకపోకలు సాగించే ఓ వారధి నిర్మించాలన్నా, మనిషి మనుగడకు అవసరమ్యే నీరు, ఆహార ధాన్యాల

తరతరాలకు చెదరని కట్టడాలు

చెరగని జ్ఞాపకాలు

చారిత్రక నిర్మాణాల రూపకర్త

తెలంగాణ ఇంజనీర ్ల పితామహుడు నవాజ్‌ బహద్దూర్‌

నేడు తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం


ఖమ్మం కలెక్టరేట్‌, జూలై 10: ఒక ప్రాంతం నుంచి మరో చోటికి రాకపోకలు సాగించే ఓ వారధి నిర్మించాలన్నా, మనిషి మనుగడకు అవసరమ్యే నీరు, ఆహార ధాన్యాల ఉత్పత్తికి ఉపయోగించే తాగునీరు, సాగునీటి ప్రాజెక్టు నిర్మితం కావాలన్నా అది ఇంజనీర్ల ప్రతిభవల్లే సాఽధ్యం అవుతుంది. సమాజానికి అవసరమయ్యే మౌలిక వసతులను కల్పించడంలోనూ వారి భాగస్వామ్యం తప్పనిసరి. దేశాభివృద్ధిలో వారి పాత్ర కీలకం. వైద్యులు వ్యక్తికి చికిత్స చేస్తే  ఇంజనీర్లు ఏకంగా సమాజానికి ఉపయోగపడే సేవలందిస్తారు. తెలంగాణ ఇంజనీరింగ్‌ పితామహుడిగా పేరుగాంచిన నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌  జయంతిని పురస్కరించుకుని జిల్లాలోకి ఇంజనీర్ల ప్రతిభకు అద్దంపట్టే కట్టడాలు. తమ ప్రతిభతో జిల్లాకు పేరుతీసుకొస్తున్న వారి గురించి ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.. 


నవాజ్‌ అలీ నవాబ్‌ జంగ్‌ జూలై 11 1877న హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి దాఫ్తర్‌ ముల్కీలో సహాయ కార్యదర్శిగా పనిచేసేవారు. శాలిబండలోని శేఖర్‌గంజ్‌లో నివసించే నవాబ్‌ జంగ్‌ సెయింట్‌ జార్జ్‌ స్కూల్లో చదివారు. అనంతరం నిజాం కాలేజిలో విద్యాబ్యాసం సాగించారు. 1996లో నిజాం ప్రభుత్వం స్కాలర్‌షి్‌పను అందించి ఇంగ్లాండ్‌కు పంపించింది. అక్కడి కూపర్స్‌హిల్‌ కళాశాలలో సివిల్‌,ఎలక్ర్టానిక్స్‌, మెకానికల్‌ బ్రాంచిలో ఇంజనీరింగ్‌ ను పూర్తిచేశారు. తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం 1899లో పబ్లిక్‌ వర్స్క్‌ శాఖలో (పీడబ్ల్యూడీ) టెలిఫోన్స్‌ విభాగాల్లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా బాధ్యతలను చేపట్టారు. 


1908వ సంవత్సరంలో భాగ్యనగరానికి వరదలు వచ్చి ప్రాణనష్టం సంబవించింది. దీంతో వరద ప్రవాహం వ్యవస్థను మెరుగుపరిచేందుకు మద్రా్‌సనుంచి మోక్షగుండం విశ్వేశ్వరయ్యను అప్పటి ఆరో నిజాం మీర్‌మహాబూబ్‌ అలీఖాన్‌ రప్పించారు. విశ్వేశ్వరయ్య సలహాలు సూచనలతో ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌కు నవాబ్‌ జంగ్‌ డిజైన్‌చేశారు.ఆ తర్వాత ఆయన మూసీనదిపై జలాశయాలు నిర్మించారు. ఆ తర్వాత హైదరాబాద్‌ నగరాకి వరదముప్పును తప్పించగలిగారు.  


ఆయన హాయంలోనే ఆర్స్ట్‌కళాశాల, అసెంబ్లీ భవనం, జూబ్లిహాల్‌, ఢిల్లీలోని బాద్‌హౌజ్‌ వంటి చారిత్రాత్మక నిర్యాణాలు పూర్తిచేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య కంటే 13ఏళ్ల చిన్నవాడైన అలీ హైదరాబాద్‌లో పలు చారిత్రాత్మక కట్టడాలకు డిజైన్‌ చేసి ప్రతిభను కనపరిచినందుకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రశంసలు అందుకున్నాడు. జంగ్‌ ప్రతిభను తెలుసుకుని బాంబే ప్రభుత్వం 1929లో ఆహ్వానించింది. ఈ మేరకు సుక్కూరు బ్యారేజి నిర్మాణానికి విశ్వేశ్వరయ్యతో ఆర్థిక సాంకేతిక అంశాల్లో సహాకారాన్ని అందించి ప్రశంసలు అందుకున్నారు. అంత టి ప్రతిభాపాటవాలు కలిగిన ఇంజనీర్‌గా దేశానికి సేవలు చేసిన భాగ్యనగర్‌ ఇంజనీర్‌ నవాజ్‌ అలీ నవాబ్‌ జంగ్‌ జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా ఆరేళ్లుగా నిర్వహిస్తూ వస్తోంది. 


నూరేళ్ల వారధి

నవాజ్‌ అలీ నవాబ్‌ జంగ్‌  హాయంలోనే ఖమ్మం మున్నేరుపై వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.. ఆయన ప్రత్యేకంగా ఖమ్మం నగరానికి రాకపోయినప్పటికీ ఆయన హాయంలోనే మున్నేటిపై వంతెన నిర్మాణాన్ని చేపట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఖమ్మం మున్నేరు నదిపై నిర్మించిన వారధికి నూరేళ్లకు పైగా నిండింది. ప్రజలు, వాహన రాకపోకలకు సజీవ సాక్ష ్యం ఈ వంతెన.నిజాంకాలంలో నిర్మించిన ఈ వంతెన రాళ్లతో నిర్మించారు. 350 మీటర్ల పొడవుతో 6మీటర ్లవెడల్పుతో నిర్మించిన ఈ వంతెన ఇప్పటికీ చెక్కుచెదరలేదు. నాటి  ఇంజనీర్ల పనితీరుకు ఈ వంతెన సాక్షీభూతంగా నిలుస్తోంది. మొత్తం 19ఖానాలు, 20 పియర్లతో నిర్మించారు.


3లక్షల క్యూసెక్కుల వరదనీరు మున్నేటి నుంచి ప్రవహిస్తున్నా నేటికి సజీవంగా ఉంది. సూర్యాపేట, హైదరాబాద్‌ రాష్ట్రీయరహదారిపై ఉన్న ఈ వంతెనపై నిత్యం వేలాది వాహనాలు ప్రయాణం సాగిస్తున్నా వంతెనకు నిర్మించిన ఏఒక్క రాయి కూడా కదలకుండా ఉన్నాయంటే ఎంతటి పరిజ్ఞానంతో నిర్మించారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవల సూర్యాపేట-దేవరపల్లి రహదారిని గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారిగా మారిన నేపథ్యంలో మున్నేరు వంతెనకు ప్రత్యామ్నాయంగా మరో వంతెన నిర్మాణాన్ని చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2020-07-11T09:20:03+05:30 IST