‘బుల్లెట్టు బండి’ పాట పెడితేనే పాలు తాగుతున్న కొండముచ్చు!

ABN , First Publish Date - 2021-08-26T18:28:36+05:30 IST

మహబూబాబాద్: ‘‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేతప్పా.. డుగ్గుడుగ్గుడుగ్గు డుగ్గుడుగ్గని..’’ ఈ పాట వింటేనే కాలు కాలు కదపాలనిస్తుంది.. డ్యాన్స్ రాకపోయినా కనీస వింటూ ఉండాలనిస్తుంది కదా.. తెలుగు రాష్ట్రాల్లో

‘బుల్లెట్టు బండి’ పాట పెడితేనే పాలు తాగుతున్న కొండముచ్చు!

మహబూబాబాద్: ‘‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేతప్పా.. డుగ్గుడుగ్గుడుగ్గు డుగ్గుడుగ్గని..’’ ఈ పాట వింటేనే కాలు కదపాలనిపిస్తుంది.. డ్యాన్స్ రాకపోయినా కనీసం వింటూ ఉండాలనిస్తుంది కదా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పాట ఎంత సంచలనం అయిందో  అందరికీ తెలుసు. ఈ పాట ఎంతో మందిని ఆకట్టుకుందనడంలో సందేహం లేదు. అయితే ప్రస్తుతం ఈ బుల్లెట్టు పాట జంతువులను కూడా ఆకట్టుకుంటోంది. ఆశ్చర్యం వేస్తోంది కదా.. మహబూబాబాద్‌లోని కంబాలపల్లెలో ఓ కొండముచ్చుకు ఈ పాట భలే నచ్చేసింది.


కంబాలపల్లెలో కిరాణ దుకాణం నడుపుతున్న ఓ వ్యక్తి.. గ్రామంలో కోతుల బెడదను నివారించేందుకు ఓ ఆడ కొండముచ్చును కొని తీసుకొచ్చాడు. దీనికి ఓ పిల్ల కొండముచ్చు ఉంది. అనారోగ్యంతో వారం క్రితం తల్లి చనిపోయింది. అప్పటినుంచి పిల్ల కొండముచ్చుకు పాలు తాపినా తాగడం లేదు. దీంతో ఈ యజమాని.. ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న బుల్లెట్టు బండి పాటను సెల్‌ఫోన్‌లో వినిపించాడు. భాష, భావం అర్థం కాకపోయినా కొండముచ్చును ఆ పాట విపరీతంగా ఆకట్టుకుంది. పాట వింటూ చకచకా పాలు తాగేస్తోంది. దీంతో గ్రామస్తులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ బుల్లెట్టు పాట జంతువులకూ ఊపు తెప్పిస్తోందని ప్రజలు చమత్కరిస్తున్నారు. 

Updated Date - 2021-08-26T18:28:36+05:30 IST