బ్రిస్బేన్‌ టెస్ట్‌ నుంచి బుమ్రా అవుట్‌

ABN , First Publish Date - 2021-01-13T10:29:19+05:30 IST

గాయాలతో డీలాపడ్డ టీమిండియాకు మరో షాక్‌ తగిలింది. పేస్‌ గన్‌ బుమ్రా కూడా గాయంతో నాలుగో టెస్ట్‌కు దూరమయ్యాడు. మూడో టెస్ట్‌లో ఆడుతున్న సమయంలో అతడు గాయపడ్డాడు.

బ్రిస్బేన్‌ టెస్ట్‌ నుంచి బుమ్రా అవుట్‌

గాయాలతో డీలాపడ్డ టీమిండియాకు మరో షాక్‌ తగిలింది. పేస్‌ గన్‌ బుమ్రా కూడా గాయంతో నాలుగో టెస్ట్‌కు దూరమయ్యాడు. మూడో టెస్ట్‌లో ఆడుతున్న సమయంలో అతడు గాయపడ్డాడు. దీంతో ఇంగ్లండ్‌తో సిరీ్‌సను దృష్టిలో ఉంచుకొని టీమిండియా మేనేజ్‌మెంట్‌.. బుమ్రాకు విశ్రాంతి నిచ్చింది. ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో అతడి పొత్తికడుపు కండరానికి స్వల్ప గాయమైనట్టు స్కానింగ్‌లో బయటపడింది. బుమ్రా గైర్హాజరీలో రెండు టెస్ట్‌ల అనుభవం ఉన్న హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌ పేస్‌ విభాగాన్ని నడిపించనున్నాడు. నవ్‌దీప్‌ సైనీ, శార్దూల్‌ ఠాకూర్‌తోపాటు నటరాజన్‌కు తుది జట్టులో చోటుదక్కే అవకాశం ఉంది. ఒకవేళ మయాంక్‌ గాయం తీవ్రమైతే.. పృథ్వీ షాకు చాన్సు దక్కొచ్చు.

Updated Date - 2021-01-13T10:29:19+05:30 IST