Abn logo
Sep 27 2021 @ 23:53PM

మోదీకి తొత్తుగా మారిన జగన!

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలు నసీర్‌ తదితరులు

టీడీపీ నేత మహ్మద్‌ నసీర్‌

గుంటూరు, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీకి తొత్తుగా సీఎం జగన మారారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, గుంటూరు తూర్పు ఇనఛార్జ్‌ మహ్మద్‌ నసీర్‌ ఆరోపించారు. భారత బంద్‌లో భాగంగా సోమవారం ఆయన నియోజకవర్గపరిఽధిలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రలో మోదీ కార్పొరేట్లకు ఒత్తాసు పలుకుతూ ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయచట్టాలు రైతులపాలిట శాపంగా మారాయన్నారు. మరోవైపు ప్రభుత్వ ఆస్తులు ప్రధానంగా ఆంధ్రుల హక్కు అయిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయటం దారుణమన్నారు. ఎందరో మహనీయుల పోరాట ఫలితం విశాఖ ఉక్కు అని నసీర్‌ గుర్తుచేశారు. ప్రధానిని ప్రశ్నించే దమ్ములేని సీఎం జగన ఆయన చెప్పినవాటికన్నింటికి తలొగ్గుతున్నారని తెలిపారు. అందులో భాగంగానే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగస్తున్నామంటున్నారన్నారు. వీటిన్నంటికి ప్రధాని మోదీ, సీఎం జగనలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కార్యక్రమంలో నేతలు, డివిజన అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు  పాల్గొన్నారు.