Abn logo
Sep 28 2021 @ 00:04AM

రైతులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాలు

అందోళన నిర్వహిస్తున్న టీడీపీ నేతలు రవీంద్ర తదితరులు

టీడీపీ పశ్చిమ ఇనచార్జి కోవెలమూడి 

గుంటూరు, సెప్టెంబరు 27: అందరికీ అన్నం పెట్టే రైతులకు కేంద్రప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో సున్నం పెడుతోందని టీడీపీ గుంటూరు పశ్చిమ ఇనచార్జ్‌ కోవెలమూడి రవీంద్ర పేర్కొన్నారు. భారత బంద్‌లో భాగంగా సోమవారం ఆయన లాడ్జిసెంటర్‌ వద్ద ఇతర నేతలతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రెండు కలిసి రైతులకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. వీరి ద్వంద్వవైఖరితో రైతులు కూలీలుగా మారుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. జగన ప్రభుత్వం అప్పుల కోసం రైతుల మోటార్లకు మీటర్లు బిగించి వారి మెడకు ఉరితాడు బిగిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుపై ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కార్యక్రమంలో నేతలు మానుకొండ శివప్రసాద్‌, కనపర్తి శ్రీనివాసరావు, కంచర్ల శివరామయ్య, అన్నాబత్తుని జయలక్ష్మి, రావిపాటి సాయికృష్ణ, నాయుడు ఓంకార్‌, మన్నవ వంశీ, ఈరంటి వరప్రసాద్‌, కొమ్మినేని కోటేశ్వరరావు, కసుకుర్తి హనుమంతరావు, సుఖవాసి శ్రీనివాసరావు, మేళం సైదయ్య, ఎలుక వీరాంజనేయులు, కొత్తూరి వెంకట్‌, సుభాని తదితరులు పాల్గొన్నారు.