Abn logo
Jul 8 2020 @ 04:25AM

ఉమ్మడి జిల్లా హామీలను మరిచిన రాష్ట్ర ప్రభుత్వం

వర్చువల్‌ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపణ 


నిజామాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లావాసులకు హామీలి చ్చి మరిచిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఉ మ్మడి జిల్లాల జన్‌సంవాద్‌ వర్చువల్‌ ర్యాలీలో మంగళవారం ఆయన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రతో కలిసి మాట్లాడారు. నిజామాబాద్‌ ఉ మ్మడి జిల్లా పరిధిలో ఎంతో మంది ప్రజా సమస్యలపైన ఉద్యమించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాము అధికారంలోకి రాగానే బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారన్నారు. కానీ నేటికీ తెరిపించలేదని సంజయ్‌ ఆరోపించారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎస్సారెస్పీ లో పూడిక పేరుకుపోయి, కెపాసిటీ తగ్గుతోందన్నారు. ప్రాజెక్టులో పూడికతీస్తే కెపాసిటీ పెరుగుతుందన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో పోడు భూముల కోసం ఎంతో మంది రైతులు ఆందోళన చేస్తున్నారన్నారు. వారి స మస్యలను పరిష్కరించడం లేదని ఆయన ఆరోపించా రు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఒక బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో మినహా ఎక్కడా డబుల్‌ బెడ్‌రూంల ఇళ్ల నిర్మాణం చేపట్టలేదన్నారు. కొన్ని ఇళ్లను కట్టి ప్రజలను మోసం చేస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించా రు.


కేంద్రం ఇస్తున్న నిధులతో ఇతర రాష్ట్రాలలో పేద ల కోసం ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారన్నారు. ప్రజలు ఎ న్నో ఆశలు రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టుకున్నా నెరవేరడం లేదన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన తె లంగాణ విశ్వవిద్యాలయానికి ఇప్పటి వరకు నిధుల విడుదల అంత మాత్రమే చేస్తున్నారన్నారు. ప్రభుత్వం విశ్వవిద్యాలయంకు తగినంతగా నిధులు విడుద ల చేయడం లేదన్నారు. ఈ ప్రాంత పేద విద్యార్థులు ఎంతో మంది విశ్వవిద్యాలయంలో చదువుతున్నా ఉ పాధి మాత్రం రావడం లేదన్నారు. ఇవే కాకుండా ఉ మ్మడి జిల్లా పరిధిలో పలు అంశాలపై సంబిత్‌ పాత్రతో కలిసి ప్రస్తావించారు. ఈ వర్చువల్‌ ర్యాలీలో వారి తో కలిసి రెండు ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎంపీలు అర్వింద్‌, సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే యెండ ల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మినర్స య్య పాల్గొన్నారు. జిల్లాలో పార్టీ కార్యాలయంలో ధన్‌పాల్‌ సూర్యనారాయణ, యెండల సుధాకర్‌, శ్రీనివాస్‌, స్వామి, మధు, ప్రభాకర్‌లు పాల్గొనగా, అంకాపూర్‌లో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. పార్టీ శ్రేణులందరూ లైవ్‌ను వీక్షించారు.


Advertisement
Advertisement