Abn logo
Apr 9 2020 @ 10:13AM

పాన్ ఇండియాపై బన్నీ కూడా దృష్టి పెట్టాడా?

ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా సినిమాల మీద అందరూ దృష్టి పెడుతున్నారు. దక్షిణాది భాషలతోపాటు హిందీలో కూడా మార్కెట్ సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక `ఆర్ఆర్ఆర్`తో రామ్‌చరణ్, ఎన్టీయార్ కూడా పాన్ ఇండియా ఇమేజ్ వైపు అడుగులేస్తున్నారు. ఇక, యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. 


వీరి బాటలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పయనిస్తున్నట్టు తెలుస్తోంది. బన్నీకి తెలుగుతో సమానంగా కేరళలో కూడా క్రేజ్ ఉంది. కన్నడ, తమిళ భాషల్లో కూడా చెప్పుకోదగ్గ ఫాలోయింగ్ ఉంది. ఇక, యూట్యూబ్‌లో డబ్బింగ్ సినిమాల ద్వారా హిందీ వాళ్లకు కూడా చేరువయ్యాడు. దీంతో ప్రస్తుతం తను నటిస్తున్న `పుష్ప` సినిమాను దక్షిణాది భాషలతోపాటు హిందీలో కూడా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. సినిమా ఫస్ట్‌లుక్‌ను అన్ని భాషల్లోనూ విడుదల చేశారు. దీని తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయబోయే `ఐకాన్` కూడా పాన్ ఇండియా సినిమాయేనని సమాచారం. 

Advertisement
Advertisement
Advertisement