May 4 2021 @ 10:09AM

గీతా ఆర్ట్స్‌లో బన్నీ - మురగదాస్ సినిమా..?

గీతా ఆర్ట్స్‌లో బన్నీ - మురగదాస్ సినిమాకి ప్లాన్ చేస్తున్నారా? అవుననే మాట ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సంస్థ ఎన్నో బ్లాక్ బస్టర్స్.. ఇండస్ట్రీ హిట్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ఇతర నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో సినిమాలు నిర్మిస్తూ వస్తున్న గీతా ఆర్ట్స్ త్వరలో సోలో ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయబోతున్నారని సమాచారం. దాదాపు 5 ఏళ్ళ తర్వాత ఈ బ్యానర్‌లో సోలోగా భారీ బడ్జెట్ సినిమాను నిర్మించబోతున్నారని తెలిసింది. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎక్కువగా మెగా హీరోలతోనే సినిమాలు నిర్మిస్తుంటారు, అయితే ఈ మధ్య జీఏ 2 బ్యానర్ ను స్థాపించి కొత్త కథలకు శ్రీకారం చుడుతూ బయటి  హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తున్నారు. 2016లో అల్లు శిరీష్ తో చేసిన 'శ్రీరస్తు శుభమస్తు' సినిమా తర్వాత మరో సినిమా గీతా ఆర్ట్స్ నుంచి రాలేదు. ఇతర నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో  'ధ్రువ', 'అల వైకుంఠపురంలో' సినిమాలు చేశారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో నిర్మిస్తున్న తెలుగు హిట్ సినిమా 'జెర్సీ' హిందీ రీమేక్ కూడా టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు - అమన్ గిల్‌తో కలిసి అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. కాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఒక భారీ బడ్జెట్ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయని వినికిడి. సొంత బ్యానర్లోనే అల్లు అరవింద్ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన రానుందట.