‘క్రెడిట్ కార్డులపై రుణాలు’... బ్యాంకులకు భారం... కార్డుల జారీలో ఇక అప్రమత్తం

ABN , First Publish Date - 2020-10-30T18:33:22+05:30 IST

క్రెడిట్ కార్డులపై రుణాలు బ్యాంకులకు భారంగా మారాయి. ఇప్పటికి క్రెడిట్ కార్డుపై బకాయిలు రూ. లక్ష కోట్లకు చేరుకున్నాయి. ఈ క్రమంలో పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యంాకులు భావిస్తున్నాయి. రానున్న కాలంలో అన్-సెక్యూర్డ్ లోన్ డిఫాల్ట్‌లు పెరిగే అవకాశముందని బ్యాంకింగ్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

‘క్రెడిట్ కార్డులపై రుణాలు’... బ్యాంకులకు భారం... కార్డుల జారీలో ఇక అప్రమత్తం

ముంబై : క్రెడిట్ కార్డులపై రుణాలు బ్యాంకులకు భారంగా మారాయి. ఇప్పటికి క్రెడిట్ కార్డుపై బకాయిలు రూ. లక్ష కోట్లకు చేరుకున్నాయి. ఈ క్రమంలో పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యంాకులు భావిస్తున్నాయి. రానున్న కాలంలో  అన్-సెక్యూర్డ్ లోన్ డిఫాల్ట్‌లు పెరిగే అవకాశముందని బ్యాంకింగ్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) విడుదల చేసిన క్రెడిట్ కార్డ్ డేటా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో మూడు శాతం ప్రతికూలత నమోదైంది.  కాగా... గత కొద్ది నెలలుగా క్రెడిట్ కార్డు జారీ సమయంలో బ్యాంకులు అప్రమత్తంగా ఉంటున్నాయి. ప్రత్యేకించి... చెల్లింపులు ఆలస్యం చేసే, డిఫాల్ట్ చరిత్ర కలిగిన ఖాతాదారులకు క్రెడిట్ కార్డులు ఇచ్చే విషయంలో జాగ్రత్త  పడుతున్నాయి. 


దేశీయంగా అతిపెద్దదైన ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కార్డు అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్‌కు సంబంధించిన కార్డు రుణాల్లో ప్రమాదకరంగా సంకేతాలు కనిపిస్తున్నట్లుగా సమాచారం. ఇక మార్చి ఒకటి నుంచి ఆగస్ట్ 31 వరకు లోన్ మారటోరియం అమల్లో ఉన్నప్పటికీ స్థూల ఎన్పీఏల్లో పెరుగుదుల కనిపించడం గమనార్హం. ఇక ఆదాయ నష్టం లేదా ఉద్యోగ నష్టం కారణంగా రుణాలు చెల్లించలేని వారికి బ్యాంకులు రెండేళ్ల పునర్నిర్మాణ రుణ సౌకర్యాన్ని కల్పించాయి.


కాగా కేవలం ఒక్క భారత్‌లో మాత్రమే కాకుండా... దాదాపు ప్రపంచమంతా ఇదే అనిశ్చితి ఉందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో మొత్తం క్రెడిట్ కార్డు వ్యాపారం మూడు శాతం ప్రతికూలంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో 10 శాతం వృద్ధిని నమదు చేయడం విశేషం. క్రెడిట్ కార్డ్ వంటి అసురక్షిత రుణాలపై ఎక్కువ మంది డిఫాల్టర్లుగా నమోదవుతూండడంతో బ్యాంకులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని భావిస్తున్నాయి. గత అయిదేళ్లలో వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు విభాగంలో ఎక్కువ వృద్ధి నమోదయినప్పటికీ చెల్లింపులు మాత్రం తీవ్రంగా ఆలస్యమవుతున్నాయి. కాగా... ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని, ప్రపంచ ఆర్థికవ్యవస్థల్లో డీఫాల్టులు పెరుగుతాయని భావిస్తున్నారు.


Updated Date - 2020-10-30T18:33:22+05:30 IST