బీజేపీకి కొత్త నిర్వచనం చెప్పిన రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2021-03-05T17:54:32+05:30 IST

అధికార బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ అంటే ట్విట్టర్ వేదికగా కొత్త అర్థం చెప్పారు. బీజేపీ

బీజేపీకి కొత్త నిర్వచనం చెప్పిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : అధికార బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ అంటే ట్విట్టర్ వేదికగా కొత్త అర్థం చెప్పారు. బీజేపీ అంటే ‘బర్డన్ జనతా పార్టీ’ అంటూ ట్విట్టర్ వేదికగా కొత్త నిర్వచనం చెబుతూ ఎద్దేవా చేశారు. బీజేపీ దోచుకున్న దానికి వ్యతిరేకంగా అందరూ గళమెత్తాలని సూచించారు. దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకుని, బీజేపీ దోచుకున్న దానిని అందరూ ప్రశ్నించాలని, తమతో గొంతు కలపాలని, దేశం మొత్తం కదిలి రావాలని రాహుల్ పిలుపునిచ్చారు. ‘‘పెరిగిన ధరలకు వ్యతిరేకంగా గళమెత్తండి’ అని ట్వీట్ చేశారు. ధరల పెరుగుదల అనేది ఓ శాపమని, పన్నుల కోసం దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఊబిలోకి నెట్టేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టారు. దేశాన్ని కేంద్ర ప్రభుత్వం విధ్వంసం దిశగా తీసుకెళ్తోందని, దానికి వ్యతిరేకంగా అందరూ గళమెత్తాలని ఆయన అభ్యర్థించారు. దీంతో పాటు పెరిగిన పెట్రోధలకు సంబంధించి ఓ వీడియోను కూడా రాహుల్ పోస్ట్ చేశారు. 

Updated Date - 2021-03-05T17:54:32+05:30 IST