ట్వీట్ తొలగించిన బర్గర్ కింగ్ ... క్షమాపణ...

ABN , First Publish Date - 2021-03-09T20:57:05+05:30 IST

ఒ‌క ట్వీట్ ఓ ప్రముఖ సంస్థకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. వివరాలిలా ఉన్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా... రెస్టారెంట్ పరిశ్రమలో లింగ అసమానతపై ట్వీట్ చేసిన అనంతరం బర్గర్ కింగ్ యూకేకు భారీ షాక్ తగిలింది.

ట్వీట్ తొలగించిన బర్గర్ కింగ్ ... క్షమాపణ...

మియామి : ఒ‌క ట్వీట్ ఓ ప్రముఖ సంస్థకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. వివరాలిలా ఉన్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా...  రెస్టారెంట్ పరిశ్రమలో లింగ అసమానతపై ట్వీట్ చేసిన అనంతరం బర్గర్ కింగ్ యూకేకు భారీ షాక్ తగిలింది. ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం ట్వీట్ పట్ల నెటిజన్లు విమర్శలు గుప్పించారు. సెటైర్లు వేశారు. అయితే ఈ సెక్సీయెస్ట్ ట్వీట్ పట్ల బర్గర్ కింగ్ ఆ తర్వాత క్షమాపణలు చెప్పింది. ‘ఉమెన్ బిలాంగ్ ఇన్ ది కిచెన్’ అంటూ చేసిన ట్వీట్ నెటిజన్ల విమర్శలకు తావిచ్చింది. అనంతరం మొదటి ట్వీట్‌ను తొలగించి, తర్వాత క్షమాపణలు చెబుతూ మరో ట్వీట్ చేసింది.


అంతకుముందు చేసిన ట్వీట్‌లో పొరపాటు దొర్లిందని, ఇందుకుక్షమించాలని రెండో ట్వీట్‌లో బర్గర్ కింగ్ పేర్కొంది. యూకే కిచెన్‌లో 20 శాతం ప్రొఫెషనల్స్ ఉన్నారని చెప్పడం తమ ఉద్దేశ్యమని పేర్కొంది. అయితే బర్గర్ కింగ్ తొలి ట్వీట్ పై విమర్శలు వెల్లువెత్తాయి.


'ఇలాంటి ట్వీట్ ఏ మాత్రం హర్షణీయం కాదు. పైగా మహిళా దినోత్సవం సందర్భంగా అసలు సరికాదు’  అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. బర్గర్ ట్వీట్‌కు పెద్ద ఎత్తున డిస్-లైక్స్ కూడా వచ్చాయి. ‘మీ సోషల్ మీడియా టీంలో లేదా మీ మార్కెటింగ్ టీంలో మహిళలు ఉండాలి. అప్పుడు ఇలాంటి ట్వీట్స్ కనిపించవు’ అని మరికొందరు విమర్శలు గుప్పించారు.

Updated Date - 2021-03-09T20:57:05+05:30 IST