ఉఖ్లా అడవుల్లో తుపాకుల డంప్ లభ్యం

ABN , First Publish Date - 2020-09-26T12:57:46+05:30 IST

మిడ్నాపూర్ జిల్లా గోయల్ టోర్ ప్రాంతం ఉఖ్లా అడవుల్లో రహస్యప్రదేశంలో ఖననం చేసిన తుపాకుల డంప్‌ను పోలీసులు కనుగొన్నారు....

ఉఖ్లా అడవుల్లో తుపాకుల డంప్ లభ్యం

పూడ్చిపెట్టిన మావోయిస్టులు...వెలికితీసిన పోలీసులు

మిడ్నాపూర్ (పశ్చిమబెంగాల్) : మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మిడ్నాపూర్ జిల్లా గోయల్ టోర్ ప్రాంతం ఉఖ్లా అడవుల్లో రహస్యప్రదేశంలో ఖననం చేసిన తుపాకుల డంప్‌ను పోలీసులు కనుగొన్నారు.ఉఖ్లా అడవుల్లో గుర్తుతెలియని మావోయిస్టులు తుపాకులను ఆరు అడుగుల గుంత తవ్వి దాచి పెట్టారని అందిన సమాచారం మేర మిడ్నాపూర్ పోలీసులు గాలించారు. జేసీబీ యంత్రం సాయంతో అడవిలో ఆరు అడుగుల గుంత తవ్వగా అందులో దుప్పట్లో చుట్టి ఉన్న 9 తుపాకులు లభించాయి. 


పీసాల గ్రామ పంచాయతీ సమీపంలోని ఉఖ్లా అటవీప్రాంతంలో పోలీసులు తవ్వించడంతో తుపాకులు వెలుగు చూశాయి. 2011లో 9 ఏళ్ల క్రితం మావోయిస్టులు అడవిలో గుంత తవ్వి తుపాకులు దాచి పెట్టారని పోలీసుల దర్యాప్తులో తేలింది. మట్టిలో పూడ్చిపెట్టిన తుపాకులు తుప్పు పట్టి ఉన్నాయి. ఈ తుపాకుల డంపుపై దర్యాప్తు చేస్తున్నామని మిడ్నాపూర్ పోలీసులు చెప్పారు. 

Updated Date - 2020-09-26T12:57:46+05:30 IST