Abn logo
Sep 27 2021 @ 23:23PM

బాదంపూడి జంక్షన్‌ వద్ద బస్సు బోల్తా

రోడ్డుపై బోల్తాపడిన బస్సు

ఉంగుటూరు, సెప్టెంబరు 27: బాదంపూడి వై జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై ఆది వారం అర్థరాత్రి ప్రైవేటు ట్రావె ల్స్‌ బస్సు బోల్తా పడడంతో సుమారు 20 మందికి గాయా లయ్యాయి. విజయవాడ నుం చి శ్రీకాకుళం వెళుతున్న సాయి కృష్ణ ట్రావెల్స్‌ బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వై జంక్షన్‌ వద్ద మలుపు తిరుగుత్ను సమయంలో డ్రైవర్‌ పగడాల పవన్‌ కుమార్‌ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. స్వల్పంగా గాయపడిన పలువురికి 108 అంబులె న్సులో ప్రథమ చికిత్స చేశారు. మోర్చా ప్రసాదు, అతడి బామ్మ యజ్జల సూరమ్మ, మజ్జి నరసింహరావును తాడేపల్లిగూడెం ఏరియా అసుపత్రికి తరలించారు. మోర్చా ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చేబ్రోలు పోలీసులు తెలిపారు.

కైకరం వద్ద డివైడర్‌పైకి దూసుకుపోయిన బస్సు

ఉంగుటూరు మండలంలో కైకరం వద్ద ఏలూరు నుంచి ఒడిశా వెళుతున్న ట్రావెల్స్‌ బస్సు సోమవారం ఉదయం అదుపు తప్పి డివైడర్‌పైకి దూసుకు పోయిం ది. ఆ సమయంలో రోడ్డుపై వెళుతున్న ఇద్దరు మహిళలు త్రుటిలో తప్పించు కున్నారు. స్థానికులు వెనుక వస్తున్న లారీని ఆపి వారి సాయం బస్సును డివైడర్‌ నుంచి దించారు. బస్సు డివైడర్‌ మధ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది.