గాలిలో తేలిన బస్సు... చాకచక్యంతో 30 మంది ప్రయాణీకులను కాపాడిన డ్రైవర్!

ABN , First Publish Date - 2021-08-07T11:52:49+05:30 IST

హిమాచల్‌ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో ఒక ప్రైవేటు బస్సు...

గాలిలో తేలిన బస్సు... చాకచక్యంతో 30 మంది ప్రయాణీకులను కాపాడిన డ్రైవర్!

సిర్మౌర్: హిమాచల్‌ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో ఒక ప్రైవేటు బస్సు డ్రైవర్ తన చాకచక్యంతో 30 మంది ప్రయాణీకుల ప్రాణాలను కాపాడాడు. వివరాల్లోకి వెళితే పాంవటా షిలాయీ నేషనల్ హైవే‌పై బొహరాఢ్ సమీపంలో ఒక బస్సు సుమారు 300 మీటర్ల లోతైన లోయలో పడిపోతున్న క్షణంలో డ్రైవర్ ఎంతో అప్రమత్తంగా వ్యవహరించి, బస్సులోని ప్రయాణీకులను కాపాడాడు. పాంవటా షిలాయీ నేషనల్ హైవే‌పై ఈ బస్సు వెళుతున్న సమయంలో స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. 


దీంతో బస్సు అదుపుతప్పి, రోడ్డు పక్కగా ఉన్న ఫుట్‌పాత్ గోడ దాటుకుని, లోయ అంచునకు చేరి గాలిలో వేలాడసాగింది. ఈ పరిస్థితిని గమనించిన ప్రయాణీకులంతా హాహాకారాలు చేశారు. బస్పులోని సగభాగం లోయవైపు వేలాడుతూ ఉంది. ఇంతటి ప్రమాదకర పరిస్థితిలోనూ డ్రైవర్ ధైర్యం కోల్పోకుండా బస్సులోని బ్రేక్‌పై తన కాలు అదిమిపెట్టి, నిలుచున్నాడు. దీంతో బస్సు వెనుక చక్రాల మీద నిలుచుంది. ఫలితంగా ప్రయాణీకులంతా నెమ్మదిగా బస్సులోంచి దిగి, తమ ప్రాణాలకు కాపాడుకోగలిగారు. తన ప్రాణాలను అడ్డుపెట్టి మరీ ప్రయాణీకుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్‌ను వారు అభినందనలతో ముంచెత్తారు. 

Updated Date - 2021-08-07T11:52:49+05:30 IST