వ‌ల‌స కూలీల బ‌స్సు బోల్తా.... 24 మంచికిపైగా తీవ్ర గాయాలు!

ABN , First Publish Date - 2020-05-23T11:26:55+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వ‌ల‌స కార్మికులను తీసుకువెళుతున్న‌ బస్సు బోల్తా ప‌డింది. ఈ ఘటనలో 24 మందికిపైగా కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ ఎస్‌ఆర్‌ఎన్ ఆసుపత్రికి త‌ర‌లించారు.

వ‌ల‌స కూలీల బ‌స్సు బోల్తా.... 24 మంచికిపైగా తీవ్ర గాయాలు!

ప్ర‌యాగ్‌రాజ్‌: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వ‌ల‌స కార్మికులను తీసుకువెళుతున్న‌ బస్సు బోల్తా ప‌డింది. ఈ ఘటనలో 24 మందికిపైగా కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ ఎస్‌ఆర్‌ఎన్ ఆసుపత్రికి త‌ర‌లించారు. ఈ బస్సు జైపూర్ నుండి పశ్చిమ బెంగాల్ వెళుతోంది. సావర్నావాబ్‌గంజ్‌లోని సహవ్‌పూర్ సమీపంలో బస్సు హైవేపై బోల్తా ప‌డింది. డ్రైవ‌ర్ మ‌గ‌త నిద్ర‌లో ఉన్న కార‌ణంగా ఈ  ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. మ‌రోవైపు ఈ రోజు తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు వలస కూలీలు మృతిచెందారు. వలస కార్మికులతో వెళుతున్న‌ పికప్ వ్యాన్ విద్యుత్ స్థంభాన్ని ఢీకొంది. దీంతో వ్యాన్ బోల్తా పడి, ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మార్చి 25 నుండి దేశంలో లాక్‌డౌన్ అమలు చేశారు. దీంతో ఉపాధి కోల్పోయిన వ‌ల‌స కార్మికులు ప‌లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  కాలినడకన త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్లడం ప్రారంభించారు. 

Updated Date - 2020-05-23T11:26:55+05:30 IST