బస్సులు.. రైళ్లు ఫుల్‌

ABN , First Publish Date - 2021-10-18T05:04:40+05:30 IST

జిల్లాలోని ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు అదివారం ప్రయాణికులతో కిటకిటలా డాయి.

బస్సులు.. రైళ్లు ఫుల్‌

 తిరుగు ప్రయాణికులతో బస్టాండ్‌, రైల్వేస్టేషన్లు కిటకిట

 జిల్లా నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ 19 స్పెషల్‌ బస్సులు

 పదికి పైగా హైదరాబాద్‌కు రైళ్లు

నరసాపురం, అక్టోబరు 17: జిల్లాలోని ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు అదివారం ప్రయాణికులతో కిటకిటలా డాయి. దసరా సెలవులు ముగియడంతో పండుగకు స్వస్థలాలకు వచ్చిన ప్రయాణికు లు తిరుగు ప్రయాణం పట్టారు. హైదరాబాద్‌, విశాఖ వెళ్లే బస్సులు కిటకిటలాడాయి. రెగ్యులర్‌ సర్వీసులు కాకుండా హైదరాబాద్‌కు ఆర్టీసీ 19 స్పెషల్‌ బస్సులు నడిపింది. ఇందులో తణుకు నుంచి 4, భీమవరం, నరసాపురం, జంగారెడ్డిగూడెం మూడేసి చొప్పున, టీపీగూడెం, కొవ్వురు ఒక్కొక్కటి, ఏలూరు నాలుగు బస్సులు ఉన్నాయి. ఇటు విశాఖకు కూడా రెగ్యులర్‌ సర్వీసులు కాకుండా అదనంగా నాలుగు బస్సులు నడిపారు. ఈసర్వీసులన్నీ ఫుల్‌ అయ్యాయి. సాయంత్రం 6 నుంచి రాత్రి 10గంటల వరకు బస్టాండ్‌ల్లో ప్రయాణికుల సందడి కనిపించింది. ఇటు ప్రైవేట్‌ ఆపరేటర్లు కూడా డిమాండ్‌ను క్యాష్‌ చేసుకున్నారు. రెగ్యులర్‌ సర్వీసులు కాకుండా అదనంగా జిల్లా నుంచి 15 బస్సులుపైనే నడిచినట్లు సమాచారం.

 జిల్లా మీదుగా 8 స్పెషల్‌ రైళ్లు..

ఇటు రైల్వే కూడా ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకుని రెగ్యులర్‌ రైళ్లు కాకుండా అదనంగా స్పెషల్‌ రైళ్లు నడిపింది. వీటిలో ఎక్కువుగా హైదరాబాద్‌ ఉన్నాయి. నరసాపురం నుంచి రెగ్యులర్‌ రైలు కాకుండా ఆదివారం రెండు స్పెషల్‌ రైళ్లు బయలుదేరాయి. ఇటు కాకినాడ నుంచి జిల్లా మీదుగా లింగంపల్లి, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌కు మూడు స్పెషల్‌ రైళ్లు వేశారు. విశాఖ నుంచి జిల్లా మీదుగా మూడు ప్రత్యేక రైళ్లు నడిచాయి. అయితే రిజర్వేషన్‌ దొరకని ప్రయాణికులంతా జనరల్‌ బోగీలను అశ్రయించాల్సి వచ్చింది. వీటికి రిజర్వే షన్‌ తొలగించడంతో అన్ని బోగీలు కిటకిటలాడాయి.


Updated Date - 2021-10-18T05:04:40+05:30 IST