బస్సును ఢీ కొన్న ఆటో

ABN , First Publish Date - 2021-01-16T06:04:56+05:30 IST

ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయే ఆటో అదుపు తప్పి బస్సును ఢీకొంది.

బస్సును ఢీ కొన్న ఆటో


పామూరు : ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయే ఆటో అదుపు తప్పి బస్సును ఢీకొంది. ఈప్రమాదంలో ఆటో డ్రైవర్‌, ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం పామూరు సమీపంలో చోటు చేసుకొంది. మండలంలోని ఇనిమెర్ల గ్రా మానికి చెందిన సిద్దవటం నారాయణ. వరికూటి కేశవకు చెందిన ఆటోలో పామూరు కు వస్తున్నారు. ఈ క్రమంలో 30 పడకల వైద్యశాల వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సిద్దవటం నారాయణకు, వరి కూటి కేశవకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు. 

Updated Date - 2021-01-16T06:04:56+05:30 IST