Abn logo
Oct 22 2021 @ 00:00AM

బస్సు బహూకరణ

బస్సు కీని అందిస్తున్న ఎల్‌ఐసీ ఆర్‌ఎం

కడప(సెవెన్‌రోడ్స్‌), అక్టోబరు 22: నగరంలో స్థానిక ఎల్‌ఐసీ డివిజనల్‌ కార్యాలయంలో రీజనల్‌ మేనేజర్‌ సాయినాథ్‌ రామకృష్ణ మిషన్‌ వారికి 47 సీట్ల సామర్థ్యం ఉన్న స్కూల్‌ బస్సును బహూకరించారు. ఈ సందర్భంగా సాయినాథ్‌ మాట్లాడుతూ బీమా సేవలతో పాటు సామాజిక సేవలు ఎల్‌ఐసీ సంస్థకు రెండు కళ్లు లాంటివన్నారు. తాము నడుపు తున్న స్కూల్‌కు బస్సు వితరణగా ఇవ్వడం అభినందనీ యమన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్‌ మేనేజర్‌ గంగాధర్‌నాయక్‌, సేల్స్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌, డివిజనల్‌ మేనేజర్‌ మధుసూదన్‌రెడ్డి, సత్యనారాయణ సాహు, డీజే శ్రీనివాస్‌, శ్రీధర్‌ పాల్గొన్నారు.