బస్సులు నడపలేం!

ABN , First Publish Date - 2022-06-06T06:15:57+05:30 IST

ఆర్టీసీలో అద్దె బస్సులు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్ప డుతోంది. రోజురోజుకూ అద్దె బస్సుల సంఖ్య తగ్గుతోం ది. ఆదాయం భారీగా పడిపోవడంతో ఆర్టీసీలో అద్దెబస్సులను నడపలేమని ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు వాపోతున్నారు. ఉమ్మడి రీజియన్‌ వ్యాప్తంగా ఆరు డిపోలు ఉండగా అందులో సుమారు 630 పైగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. అందులో ఆర్టీసీ బస్సులు సుమారు 400 కాగా, 242 బస్సులు అద్దె బస్సులు నడుపుతున్నారు.

బస్సులు నడపలేం!

ఆర్టీసీలో అద్దె బస్సులను నడపలేమంటున్న యజమానులు

నెలవారి బిల్లుల చెల్లింపులో ఆలస్యం

భారం పడుతోందని బస్సులను అమ్ముకుంటున్న వైనం

స్లాబ్‌ రేట్‌లను పెంచాలని బస్సు యజమానుల డిమాండ్‌

ఆర్టీసీలో రోజురోజుకూ తగ్గుతున్న అద్దెబస్సుల సంఖ్య

సుభాష్‌నగర్‌, జూన్‌ 5: ఆర్టీసీలో అద్దె బస్సులు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్ప డుతోంది. రోజురోజుకూ అద్దె బస్సుల సంఖ్య తగ్గుతోం ది. ఆదాయం భారీగా పడిపోవడంతో ఆర్టీసీలో అద్దెబస్సులను నడపలేమని ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు వాపోతున్నారు. ఉమ్మడి రీజియన్‌ వ్యాప్తంగా ఆరు డిపోలు ఉండగా అందులో సుమారు 630 పైగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. అందులో ఆర్టీసీ బస్సులు సుమారు 400 కాగా, 242 బస్సులు అద్దె బస్సులు నడుపుతున్నారు. ఇందులో కొన్ని రోజులుగా పదికిపైగా బస్సులు తాము ఆర్టీసీలో బస్సులు నడపలేమని ఎన్‌వోసీ తీసుకుని వెళ్లిపోయారు. వీరు బస్సులను నిర్వహణ చేయలేక అమ్ముకున్నారు. ప్రతి రోజూ 242 బస్సుల్లో సుమారు 20 నుంచి 40 బస్సులు ఏదో ఒక కారణంతో రోడ్లపైకి రావడంలేదు. ఇందులో ఎక్కువగా మేంటెనెన్స్‌ కోసం డబ్బులు లేక బస్సులు నడపలేకపోతున్నామని తెలిపారు. కాస్ట్‌ ఆఫ్‌ మేంటనెన్స్‌ పెరిగిపోవడం ముఖ్యకారణంగా కనిపిస్తోంది. అసలే కరోనాతో అద్దె బస్సుల యజమానుల కు కష్టాలు మొదలవగా కరోనా తర్వాత అన్ని ధరలు పెరిగిపోవడంతో బస్సులు నడపడం మరింత ఇబ్బం దిగా మారింది. గతంలో ఆర్టీసీ టైర్‌ కాస్ట్‌ డ్రైవర్‌ వేజ్‌ ఇస్తుండగా ప్రస్తుతం ఆర్టీసీ నుంచి ఎలాంటి సహకారం అందడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అద్దె బస్సుల్లో ఆర్టీసీ కోసం డ్రైవర్‌లకోసమే నడుపుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలవారి ఫైనాన్స్‌ చెల్లించలేకపోతున్నామని వాపోతున్నారు.

పెంచిన మైలేజీ..

అద్దె బస్సులకు మైలేజీ పెంచడంతో అద్దె బస్సుల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. 2017 వరకు లీటర్‌కు 5.4 మైలేజీ ఉండగా 2019కి అదే లీటర్‌కు 5.6 మైలేజ్‌ చేశారు. దీంతో డీజిల్‌కే ఎక్కువ డబ్బులు పోతున్నాయి. డీజిల్‌ రేట్లు పెరగడంతో సుమారు నెలకు రూ.15వేల వరకు అందులోనే నష్టపోతున్నామని ఆర్టీసీ అధికారులు తెలుపుతున్నారు. 

స్లాబ్‌రేట్‌లను పెంచాలి..

ప్రస్తుతం కి.మీలకి స్లాబ్‌ రేట్‌ 7 రూపాయల నుంచి 9.50 పైసల వరకు ఇస్తున్నారు. ఇంతేకాకుండా ఒక రూట్‌ బస్సు సుమారు 350 కి.మీలు తిరగాల్సి ఉండగా ఒక్కోసారి ప్రయాణికులు లేరని 200 కి.మీలకే బస్సును నిలుపుదల చేసి అదే స్లాబ్‌రేట్‌ను కట్టించడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. 200 కి.మీలు తిరగే బస్సులకు రూపాయలకు పైగా ఇస్తుండగా ఈ బస్సులకు 7 నుంచి 9.50 పైసలు కట్టించి నష్టాల్లోకి నెట్టివేస్తున్నారని ఆర్టీసీ అ ద్దె బస్సుల యజమానులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా స్లాబ్‌ రేట్‌లు పెంచాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

నెలవారి చెల్లింపుల్లో ఆలస్యం..

అద్దె బస్సులు అద్దెను ఆర్టీసీ సంస్థ నెలనెల చెల్లించాల్సి ఉంటుంది. గత కొద్ది రోజులుగా అద్దె బస్సులకు చెల్లింపులు ఆలస్యం జరుగుతోంది. ఒకేసారి చెల్లించాల్సిన డబ్బులను 1/4 వంతు చెల్లిస్తూ ఆలస్యం చేస్తున్నారు. దీంతో అద్దె బస్సుల యజమానులు నిర్వహణ ఖర్చు భారంగా మారింది. లక్ష రూపాయలు రావాల్సి ఉండగా రూ.25వేలు చొప్పున డబ్బులు వేస్తూ ఆలస్యం చేస్తున్నారని అద్దె బస్సు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలానే జరిగితే ఆర్టీసీలో బస్సులను నడపలేమని తెలుపుతున్నారు. 

   బస్సుల నిలుపుదలతో ప్రయాణికుల కష్టాలు..

రోజువారి ప్రయాణాల్లో ఆర్టీసీ పాత్ర ప్రధానమైంది. రోజు అత్యధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. చాలా రూట్‌లలో అద్దె బస్సు లు నడుస్తుండడంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు. అయితే  కొంతకాలంగా అద్దె బస్సులో కొన్ని రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రోజు పది నుంచి 20 అద్దె బస్సులు రోడ్లపైకి రావడంలేదు. వాటిస్థానంలో ఆర్టీసీ బస్సులు కూడా రాకపోవడంతో ప్రయాణాలు ఇబ్బందిగా మారాయి. అద్దె బస్సుల స్థానంలో ఆర్టీసీ బస్సులను యథావిధిగా నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

స్లాబ్‌రేట్‌లను పెంచాలి..

ఫ సురేష్‌, నగర అధ్యక్షుడు (అద్దెబస్సుల యజమానుల సంఘం)

అద్దెబస్సుల నిర్వహ ణ వ్యయం పెరిగింది. దానికి అనుగుణంగా స్లా బ్‌రేట్‌లను పెంచాలి. దీనికితోడు నెలవారి చెల్లింపుల ను ఒకేసారి చేయాలి. అద్దె బస్సుల నిర్వహణ వ్యయం తో యజమానులు అద్దె బ స్సులను విక్రయిస్తున్నారు. 

అగ్రిమెంట్‌ ముగియడంతో నిలిపివేశాం..

ఫ ఉషాదేవి, రీజినల్‌ మేనేజర్‌

ఆర్టీసీలో కొన్ని అద్దెబస్సుల అగ్రిమెంట్‌ అయిపోవడం వల్లనే నిలిపివేసాం. వారికి రావాల్సినవి ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం. అద్దె బస్సుల యజమానులకు డ్రైవర్‌లతో, ఇతర సమస్యలతో ఇబ్బందులు ఉండి కొ న్ని బస్సులు రావడంలేదు. నిలుపుదల చే సిన బస్సులన్నీ అగ్రిమెంట్‌ గడువు ముగిసినదే.

Updated Date - 2022-06-06T06:15:57+05:30 IST