Advertisement
Advertisement
Abn logo
Advertisement

సమయానికి బస్సులు నడపాలి

నారాయణపేట, డిసెంబరు 2 : నారాయణపేట డిపో నుంచి ఊట్కూరు మం డలం ఓబులాపూర్‌, అమీన్‌పూర్‌, పగిడిమర్రి గ్రామాలకు పాఠశాలల సమయానికి బస్సులు నడిపించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో మెయిన్‌రోడ్‌పై ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.   ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థి సంఘం నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సురేష్‌గౌడ్‌ సంఘటనా స్థలానికి చేరుకొని ఏబీవీపీ నాయకులు, విద్యార్థులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. విద్యార్థుల ఆందోళనకు బీజే వైఎం నాయకుడు సత్యాయాదవ్‌ మద్దతు పలికారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా క న్వీనర్‌ రామకృష్ణ, గంగాధర్‌, చరణ్‌, వెంకటరమణ, నరేష్‌,  విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement