Advertisement
Advertisement
Abn logo
Advertisement

వ్యాపారవేత్త బంపరాఫర్.. పిల్లిని పట్టిస్తే రూ.20 వేలు!

తన పెంపుడు పిల్లి కోసం ఓ వ్యాపారవేత్త బంపరాఫర్ ప్రకటించాడు. రెండ్రోజుల నుంచి కనిపించకుండా పోయిన తన పెంపుడు పిల్లిని పట్టి తెచ్చిస్తే రూ.20 వేలు ఇస్తానని ప్రకటించాడు. ఈ ప్రకటన తాజాగా వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్-45లో నివసిస్తున్న వ్యాపారవేత్త అభిరాజ్ తాజాగా ఈ ప్రకటన చేశారు. 


గురువారం నుంచి తన పెంపుడు పిల్లి `జోయా` కనిపించడం లేదని ఆయన ఆందోళన చెందుతున్నారు. సీసీటీవీ కెమేరాల ద్వారా చూస్తే జోయా ఇంటి నుంచి బయటకు వెళ్లినట్టు తెలిసిందన్నారు. ఎవరికైనా జోయా కనిపిస్తే తీసుకొచ్చి ఇవ్వాలని సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అంతేకాదు.. అలా తీసుకొచ్చిన వారికి రూ.20 వేలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement