త్వరలో రెనో నుంచి కొత్త మోడళ్లు

ABN , First Publish Date - 2020-08-03T07:52:40+05:30 IST

భారత మార్కెట్లోకి కొత్త మోడళ్లను తీసుకువచ్చేందుకు ఫ్రెంచ్‌ కార్ల తయారీ సంస్థ రెనో రెడీ అవుతోంది. కంపెనీ ఇప్పటికే దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ లెవల్‌ కారు క్విడ్‌లో ఏఎంటీ వెర్షన్‌తో పాటు

త్వరలో రెనో నుంచి కొత్త మోడళ్లు

న్యూఢిల్లీ : భారత మార్కెట్లోకి కొత్త మోడళ్లను తీసుకువచ్చేందుకు ఫ్రెంచ్‌ కార్ల తయారీ సంస్థ రెనో రెడీ అవుతోంది. కంపెనీ ఇప్పటికే దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ లెవల్‌ కారు క్విడ్‌లో ఏఎంటీ వెర్షన్‌తో పాటు ట్రైబర్‌ను తీసుకువచ్చిందని, రానున్న రోజుల్లో ఎస్‌యూవీ విభాగంలో సరికొత్త టర్బో ఇంజన్‌ (పెట్రోల్‌)తో కూడిన డస్టర్‌ను విడుదల చేయటంతో పాటు మరికొన్ని కొత్త మోడళ్లను తీసుకురానున్నట్లు రెనో ఇండియా సీఈఓ, ఎండీ వెంకట్రామ్‌ మామిళ్లపల్లె వెల్లడించారు. క్విడ్‌, ట్రైబర్‌ కార్లకు వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కాగా  కంపెనీకి భారత మార్కెట్‌ చాలా కీలకంగా ఉందని, ఇందులో భాగంగానే కొత్త మోడళ్లను తీసుకువస్తున్నట్లు చెప్పారు. కొత్త మోడళ్లతో పాటు అమ్మకాలు పెంచుకోవటానికి గ్రామీ ణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసిక అమ్మకాల్లో గ్రామీణ ప్రాం తాల వాటా 19 శాతంగా ఉండగా ఏప్రిల్‌-జూన్‌ కాలానికి 25 శాతానికి పెరిగిందని తెలిపారు.

Updated Date - 2020-08-03T07:52:40+05:30 IST