కీలక స్థాయి 17000

ABN , First Publish Date - 2021-11-29T09:28:15+05:30 IST

నిఫ్టీ గత వారం భారీ కరెక్షన్‌తో ప్రారంభమై అదే ధోరణిలో ట్రేడవుతూ 740 పాయింట్ల భారీ నష్టంతో వారం కనిష్ఠ స్థాయిలో క్లోజయింది....

కీలక  స్థాయి 17000

నిఫ్టీ గత వారం భారీ కరెక్షన్‌తో ప్రారంభమై అదే ధోరణిలో ట్రేడవుతూ 740 పాయింట్ల భారీ నష్టంతో వారం కనిష్ఠ స్థాయిలో క్లోజయింది. 17500 వద్ద విఫలం కావడం ద్వారా తక్షణ అప్‌ట్రెండ్‌ ఆశలు కూడా అంతరించిపోయాయి. గత కొద్ది వారాలుగా నిఫ్టీ 1600 పాయింట్ల మేరకు నష్టపోయింది. విదేశీ సంస్థల అమ్మకాలే ఇందుకు దారి తీశాయి. ట్రెండ్‌లో సానుకూలత కోసం మద్దతు స్థాయిల్లో  కన్సాలిడేట్‌ కావడం తప్పనిసరి. ప్రస్తుతం ఇండెక్స్‌ మానసిక అవధి 17000 వద్ద ఉంది. ప్రస్తుతం అందుతున్న అంతర్జాతీయ సంకేతాలను బట్టి చూసినా మార్కెట్‌ ఈ స్థాయి కన్నా దిగజారే ఆస్కారమే కనిపిస్తోంది. తక్షణ ఆశలు సజీవంగా ఉండాలంటే మాత్రం ఇక్కడ పునరుజ్జీవం తప్పనిసరి. 

బుల్లిష్‌ స్థాయిలు: రికవరీ బాట పట్టినట్టయితే 17000 కన్నా పైన బలంగా కన్సాలిడేట్‌ కావడం లేదా క్లోజ్‌ కావడం అవసరం. ప్రధాన నిరోధం 17400. ఆ పైన మాత్రమే మరింత అప్‌ట్రెండ్‌ ఉంటుంది. మరో ప్రధాన నిరోధం 17600. ఇదే స్వల్పకాలిక నిరోధం కావడం వల్ల ఆ పైన నిలదొక్కుకుని తీరాలి.

బేరిష్‌ స్థాయిలు: మరింత బలహీనత ప్రదర్శించినట్టయితే దిగువన కీలక మద్దతు స్థాయి 16750. భద్రత కోసం ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. కీలక ప్రధాన మద్దతు స్థాయి 16500. ప్రస్తుత బలహీన ట్రెండ్‌లో మార్కెట్‌ మద్దతు సాధించి కొద్ది రోజుల పాటు నిలదొక్కుకోవడం అవసరం.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ కూడా 2000 పాయింట్ల నష్టంతో వారం కనిష్ఠ స్థాయిల్లో క్లోజయింది. గత కొద్ది వారాల్లో 5800 పాయింట్ల మేరకు నష్టపోయి ప్రస్తుతం కీలక స్థాయి 36000 సమీపంలో ఉంది. ట్రెండ్‌లో సానుకూలత కోసం ఇక్కడ బలంగా కన్సాలిడేట్‌ కావాలి. ప్రధాన మద్దతు స్థాయిలు 35700, 35300. అంతకన్నా దిగువన 34800.

పాటర్న్‌: 17000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిలదొక్కుకోలేకపోతే మరింత బలహీనతను ప్రదర్శిస్తుంది. గత వారంలో మార్కెట్‌ 100 డిఎంఏ కన్నా కూడా దిగజారి ప్రస్తుతం 200 డిఎంఏకి సమీపంలో ఉంది. ఇక్కడ కన్సాలిడేషన్‌కు ఆస్కారం ఉంది.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి రివర్సల్‌ ఉంది.

Updated Date - 2021-11-29T09:28:15+05:30 IST