Apr 21 2021 @ 00:43AM

జూన్‌లో బతుకు బస్టాండ్‌

విరాన్‌ ముత్తంశెట్టి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బతుకు బస్టాండ్‌’. నికితా అరోరా, శృతీశెట్టి హీరోయిన్లు. చక్రధర్‌ రెడ్డి సమర్పణలో ఐ.ఎన్‌. రెడ్డి దర్శకుడిగా కవితారెడ్డి, కె. మాధవి నిర్మిస్తున్నారు. జూన్‌ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బతుకు బస్టాండ్‌’ చిత్రం థీమ్‌ను పరిచయం చేస్తూ ఇటీవల దర్శకుడు విడుదల చేసిన గ్లిమ్స్‌ వీడియోను ఆదరించిన ప్రేక్షకులకు చిత్రబృందం ధన్యవాదాలు తెలిపింది. మహావీర్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు.