నిత్యావసరాలన్నీ ఒకేచోట లభించాలి

ABN , First Publish Date - 2021-02-23T05:32:47+05:30 IST

నగరంలో ఆధునిక శాఖాహార, మాంసాహార మార్కెట్లలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని నిత్యావసరాల వస్తువులన్నీ ఒకే చోట లభించేలా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ అధికారులకు సూచించారు.

నిత్యావసరాలన్నీ ఒకేచోట లభించాలి
బస్టాండ్‌ పనులను పరిశీలిస్తున్న దృశ్యం

 ప్రజల అవసరాలన్నీ తీరాలి

కలెక్టర్‌ కర్ణన్‌

వివిధ అభివృద్ధి పనుల పురోగతి పరిశీలన

ఖమ్మంకలెక్టరేట్‌, ఫిబ్రవరి22: నగరంలో ఆధునిక శాఖాహార, మాంసాహార మార్కెట్లలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని నిత్యావసరాల వస్తువులన్నీ ఒకే చోట లభించేలా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ అధికారులకు సూచించారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండు, టేకులపల్లిలో డబుల్‌బెడ్‌ రూం ఇళ్లనిర్మాణాలు, లకారం ట్యాంక్‌ బండ్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జి పనుల పురోగతిని కలెక్టర్‌ కర్ణన్‌ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆధునిక వసుతలో మోడ్రన్‌ వెజ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ను నగర ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని రైతుబజార్‌తో పాటు నిత్యావసర వస్తువులు శాఖాహార మాంసాహార విక్రయాలు ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న నాన్‌ వెజ్‌ విక్రయ దారులు మార్కెట్‌లోనే విక్రయాలు జరిపేలా అవగాహన కల్పించి మార్కెట్‌కు త రలించాలని నగరపాలక సంస్థ కమీషనర్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. కొత్తఆర్టీసీ బస్టాండు పనులను ప్రయాణీకుల సౌకర్యాలు, ముగింపు పనులను పరిశీలించి అధికారులకు   సూచనలు చేశారు. బస్టాండు ప్రవేశ మార్గం ముఖద్వారం బైపాస్‌ రోడ్డుపై ట్రాఫిక్‌కు ఏలాంటి అంతరాయం కలగకుండా ఆర్టీసీ బస్సులు నడిచేలా శాశ్వత ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్‌ సూచించారు. టేకులపల్లిలో డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాల ముగింపు పనులను పరిశీలించారు. గృహా సముదాయాల్లో అంతర్గత సీసీరోడ్లు విద్యుత్‌ సౌకర్యం , కరెంట్‌ మీటర్లు, వీధి దీపాల ఏర్పాటు, ప్రతి ఇంటికీ తాగు నీరు సరఫరా లాంటి మౌళిక సదుపాయాల కల్పన పనులు యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. పురో గతిలో ఉన్న ఇళ్ల పనులను మరింత వేగిరం చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. లకారం ట్యాంక్‌ బండ్‌లో ఏర్పాటు చేస్తున్న సస్పెన్షన్‌ బ్రిడ్జి పనుల ను పరిశీలించిన కలెక్టర్‌ అనంతరం మున్నేరు స్మశాన వాటిక ఆధునికీకరణ పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట నగరపాలక సంస్థ కమీషనర్‌ అనురాగ్‌ జయంతి, శిక్షణ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, డీఆర్వో శిరీష, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్యాంప్రసాద్‌, ఆర్టీసీ ఆర్‌ఎం సాల్మన్‌, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-23T05:32:47+05:30 IST