సరిహద్దులో ముమ్మరంగా తనిఖీలు

ABN , First Publish Date - 2021-12-03T06:54:46+05:30 IST

రాష్ట్ర సరిహద్దుగా ఉన్న సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద పోలీస్‌, రెవెన్యూ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

సరిహద్దులో ముమ్మరంగా తనిఖీలు

కోదాడ రూరల్‌, డిసెంబరు 2: రాష్ట్ర సరిహద్దుగా ఉన్న సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద పోలీస్‌, రెవెన్యూ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. గురువారం ఆంధ్రా నుంచి రాష్ట్రంలోకి వచ్చే ధాన్యం ట్రాక్టర్లు, లారీలను క్షుణ్ణంగా తనిఖీ చేశా రు. ఆంధ్రాకు చెందిన గ్రామాలైన తక్కెళ్లపాడు, బల్సుపాడు, అన్న వరం, షేర్‌మహ్మద్‌పేట గ్రామాల నుంచి రైతులు ధాన్యాన్ని కోదాడలో విక్రయిస్తుంటారు. ఏపీ ధాన్యాన్ని అడ్డుకోవాలన్న ప్రభుత్వ ఆ దేశాలతో చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేస్తున్నారు. ధాన్యం ట్రాక్టర్లను సరిహద్దు వద్దనే నిలిపివేసి వెనక్కి పంపినట్లు ఆర్డీవో కిషోర్‌ కుమార్‌ తెలిపారు. చెక్‌పోస్టును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి ఆంధ్రా సరిహద్దు గ్రామాల నుంచి ధాన్యం వచ్చినట్లయితే వెంటనే వెనక్కి పంపాలని చెక్‌పోస్టు సిబ్బందిని ఆదేశించారు. 




Updated Date - 2021-12-03T06:54:46+05:30 IST