Abn logo
Sep 16 2021 @ 23:25PM

ముమ్మరంగా వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌

పుల్‌కల్‌ మండలంలోని ఎస్‌.ఇటిక్యాలలో వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న సంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల మంజుశ్రీ

జిన్నారం/పుల్‌కల్‌/ఝరాసంగం/మునిపల్లి/నారాయణఖేడ్‌, సెప్టెంబరు 16 : అర్హులైన ప్రతీ ఒక్కరికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందిస్తామని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం బొల్లారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ప్రత్యేక వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రోజారాణి, కౌన్సిలర్లు చంద్రారెడ్డి, హన్మంతరెడ్డి, కమిషనర్‌ రాజేంద్రకుమార్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పుల్కల్‌ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ రుబెన్‌ చక్రవర్తి పర్యవేక్షణలో గొంగ్లూరు, సింగూరు, ముద్దాయిపేట, ముదిమాణిక్యం, ఎస్‌.ఇటిక్యాల గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డి ఎంపీడీవో మధులతతో కలిసి ఎస్‌.ఇటిక్యాల, సింగూరు గ్రామాల్లోని వ్యాక్సినేషన్‌ శిబిరాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మన్నె రాధయ్య, రాజుగౌడ్‌, లక్ష్మీరామచంద్రారెడ్డి, పడమటి అరుణయాదగిరి, మాచర్ల పద్మ పాల్గొన్నారు. ఝరాసంగం మండలంలోని కుప్పానగర్‌, ఈదులపల్లి, క్రిష్ణాపూర్‌ గ్రామాల్లో వైద్యాధికారులు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ప్రారంభించారు. సర్పంచులు లక్ష్మీబాయి, బస్వరాజ్‌ పాటిల్‌, ఆశావర్కర్లు పాల్లొన్నారు. మునిపల్లి మండలంలోని గొర్రెగట్టు, పొల్కంపల్లి, హైద్లాపూర్‌, అల్లాపూర్‌, మల్లారెడ్డిపేటలో జడ్పీటీసీ మీనాక్షిసాయికుమార్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమే్‌షచంద్ర కులకర్ణి, ఎంపీవో అంజనీదేవి, ఉపసర్పంచ్‌ వీరన్న పాల్గొన్నారు. నారాయణ మండలం నిజాంపేట పీహెచ్‌సీ పరిఽధిలోని సంజీవన్‌రావుపేట, లింగాపూర్‌, నమ్లీమేట్‌, తుర్కపల్లి సత్యగామ, అబ్బెంద, చాప్టా.కె, సిర్గాపూర్‌ పరిధిలోని కడ్పల్‌, మార్డి, కల్హేర్‌ పరిధిలోని మాసాన్‌పల్లి, క్రిష్ణాపూర్‌, కంగ్టి పరిధిలోని తుర్కవడగాం, దెగుల్‌వాడి, నాగన్‌పల్లి, తడ్కల్‌, కర్‌సగుత్తి పరిధిలోని కిషన్‌నాయక్‌తండా, దామర్‌గిద్ద, మనూరు పీహెచ్‌సీ పరిధిలోని బెల్లాపూర్‌, బాదల్‌గాం, మాయికోడ్‌లో వ్యాక్సిన్‌ వేశారు. అలాగే నారాయణఖేడ్‌ పట్టణంలోని ప్రాంతీయ ఆస్పత్రి, ఆరోగ్య ఉపకేంద్రంలో వ్యాక్సిన్లు వేశామని మున్సిపల్‌ కమిషనర్‌ గోపు మల్లారెడ్డి తెలిపారు. 

మెదక్‌ జిల్లాలో 

తూప్రాన్‌ (మనోహరాబాద్‌)/తూప్రాన్‌/తూప్రాన్‌ రూరల్‌/మెదక్‌ మున్సిపాలిటీ/చిన్నశంకరంపేట/టేక్మాల్‌/నిజాంపేట/చిల్‌పచెడ్‌, సెప్టెంబరు 16 : కొవిడ్‌ బారినపడకుండా ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ పేర్కొన్నారు. గురువారం మనోహరాబాద్‌లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ కేంద్రాన్ని సందర్శించారు. పార్టీ మండల అధ్యక్షుడు పురం మహేశ్‌, తూప్రాన్‌ పీహెచ్‌సీ వైద్యాధికారి ఆనంద్‌, వినోద పాల్గొన్నారు. వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని తూప్రాన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, ఆర్డీవో శ్యాంప్రకాశ్‌ పేర్కొన్నారు. గురువారం తూప్రాన్‌ మండలంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కేంద్రాలను కమిషనర్‌ మోహన్‌తో కలిసి పరిశీలించారు. తూప్రాన్‌ మండలంలోని నాగులపల్లి, గుండ్రెడ్డిపల్లి, ఘనపూర్‌ గ్రామాల్లో వ్యాక్సిన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. గుండ్రెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన శిబిరానికి టీకా వేయించుకునేందుకు నర్సంపల్లి గ్రామస్థులు ట్రాక్టర్‌లో వచ్చారు. 18 ఏళ్లు పైబడిన ప్రతీఒక్కరు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌ పిలుపునిచ్చారు. మెదక్‌ జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను పరిశీలించారు. చిన్నశంకరంపేటలోని అంబాజీపేట, గవ్వలపల్లి, మడూర్‌ గ్రామాల్లో వ్యాక్సిన్‌ కేంద్రాలను మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రావణి పరిశీలించారు. టేక్మాల్‌ మండల కేంద్రంతో పాటు పల్వంచ, ఎలకుర్తి, కుసంగిలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ కేంద్రాలను ఎంపీపీ స్వప్న పరిశీలించారు. నిజాంపేట మండలంలోని నస్కల్‌, నందగోకుల్‌, రాంపూర్‌ నగరంతండాలో వ్యాక్సిన్‌ వేశారు. చిల్‌పచెడ్‌ మండలంలోని సోమక్కపేట, ఫైజాబాద్‌, గంగారం, చండూర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి పరిశీలించారు. ఎంపీడీవో శశిప్రభ, ఎంపీవో పోలేశ్వరరాజు ఉన్నారు.