Advertisement
Advertisement
Abn logo
Advertisement

మనసు మార్చుకున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి

అమరావతి: టీడీపీ నేతల బుజ్జగింపులు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహం ఫలించింది. ఎట్టకేలకు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మనసుమార్చుకున్నారు. రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. పార్టీలో లోటు పాట్లు సరిచేసుకుంటామని చెప్పారు. పదవి ఉన్నా లేకపోయినా.. పార్టీ కోసం కష్టపడుతున్నానని తెలిపారు. పార్టీలో కొంతమంది సరిగా పనిచేయడం లేదనే అభిప్రాయం తనకు ఉందన్నారు. అయితే పార్టీని నమ్ముకున్న వాళ్లను గౌరవించాలని బుచ్చయ్య చౌదరి కోరారు. 


అంతకుముందు చంద్రబాబుతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి భేటీ అయ్యారు. టీడీపీలో నెలకొన్న పరిస్థితులపై ఇటీవల బుచ్చయ్య చౌదరి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యనేతల సంప్రదింపులతో బుచ్చయ్య అధిష్టానం దగ్గరకు వచ్చారు. ఈ భేటీలో టీడీపీ నేతలు చినరాజప్ప, నల్లమల్లి రామకృష్ణారెడ్డి, గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. తీవ్ర అసంతృప్తితో తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ పదవికి వారం రోజుల్లో రాజీనామా చేస్తానని సన్నిహితుల వద్ద బుచ్చయ్య చౌదరి చెప్పడం పార్టీలో అప్పట్లో కలకలం రేగింది. సీనియర్‌నైనా తనకు గుర్తింపు లేదని, తనమాటకు విలువలేదని.. కావాలనే రాజమండ్రి రూరల్‌కు పంపించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 


Advertisement
Advertisement