85 లీటర్ల సారా స్వాధీనం

ABN , First Publish Date - 2020-07-18T11:36:45+05:30 IST

బుట్టాయగూడెం పోలీసులు, జంగారెడ్డిగూడెం ఎక్సై జ్‌ అధికారులతో కలిసి మండలంలోని ముద్దప్పగూడెం శివారులో సారా బట్టీలపై ..

85 లీటర్ల సారా స్వాధీనం

బుట్టాయగూడెం, జూలై 17: బుట్టాయగూడెం పోలీసులు, జంగారెడ్డిగూడెం ఎక్సై జ్‌ అధికారులతో కలిసి మండలంలోని ముద్దప్పగూడెం శివారులో సారా బట్టీలపై శుక్రవారం దాడులు నిర్వహించినట్టు ఎస్‌ఐ ఎం.వెంకటేశ్వరావు తెలిపారు. సారా కాస్తున్న ఐదుగురిని అరెస్టు చేశామని, వారి నుంచి 60 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సారా తయారీకి 15 డ్రమ్ముల్లో సిద్ధం చేసిన 3000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.  


నిడదవోలు : మునిపల్లి శివారు నడిపల్లికి చెందిన చిటికిన వెంకట నారాయణ అనే వ్యక్తి వద్ద సారా ఉండడంతో అరెస్ట్‌ చేశామని సమిశ్రగూడెం హెడ్‌ కాని స్టేబుల్‌ జీఆర్‌కే గంగాధరరావు శుక్రవారం తెలిపారు. అతని వద్ద నుంచి 15 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నామన్నారు. 


పోలవరం : సారా తరలిస్తున్న ఇద్దరిని శుక్రవారం అరెస్టు చేసి జంగారెడి ్డగూడెం కోర్టుకి తరలించినట్టు పోలవరం ఎస్‌ఐ ఆర్‌.శ్రీను తెలిపారు. ఎల్‌ఎన్‌డీ పేటకు చెందిన దవనం వెంకటసాయి కిరణ్‌, పైడిపాకకు చెందిన కొట్రా విలియం కౌరి పది లీటర్ల సారా తరలిస్తుండగా అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు. 


కామవరపుకోట : తూర్పుయడవల్లి సమీపంలో సారా తయారీ కేంద్రాలపై శుక్రవారం ఎక్సైజ్‌  అధికారులు దాడి చేశారు. సారా తయారీకి నిల్వ ఉంచిన 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. టాస్క్‌ఫోర్స్‌ అధికారి సుబ్బారెడ్డి, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఆయేషా బేగం, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ ధర్మరాజు, తడికలపూడి, ద్వారకా తిరుమల పోలీసులు పాల్గొన్నారు. 


యలమంచిలి : శిరగాలపల్లిలో వాడపల్లి వెంకన్న అనే వ్యక్తి నుంచి 16 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ కె.గంగాధరరావు తెలిపారు. 

Updated Date - 2020-07-18T11:36:45+05:30 IST