Advertisement
Advertisement
Abn logo
Advertisement

ధాన్యం కొనాలి.. రైతుల్ని ఆదుకోవాలి

పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ ఎంపీల డిమాండ్‌

పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసనలు కొనసాగుతున్నాయి. ధాన్యం కొనుగోలు చేయాలని, వార్షిక కొనుగోలు లక్ష్యాన్ని ఒకేసారి ప్రకటించాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. బుధవారం ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉభయసభల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు వెల్‌లోకి వెళ్లి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీ నామా నాగేశ్వరరావు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తిరస్కరించారు. దీంతో ఎంపీలు ప్రభాకర్‌ రెడ్డి, కవిత, శ్రీనివా్‌సరెడ్డి, వెంకటేశ్‌ నేత, రంజిత్‌రెడ్డి, రాములు, బీబీ పాటిల్‌, పసునూరి దయాకర్‌లు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. సభా కార్యకలాపాలను అడ్డుకునే ప్రయ త్నం చేశారు. 


దీంతో ఉదయం సభ కొద్దిసేపు వా యిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా వెల్‌లోకి వెళ్లి నిరసనలు కొనసాగించారు. అయినప్పటికీ స్పీకర్‌ సభ ను నడిపించారు. స్పీకర్‌ పోడియం ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎంపీలు బైఠాయించారు. ఎంపీ కె.కేశవరావు విలేకరులతో మాట్లాడుతూ.. కేరళ, తమిళనాడు, ఒడిసా రాష్ట్రాల ఎంపీలతో కలిసి ధాన్యం కొనుగోలుపై పార్లమెంటులో సంయుక్తంగా నిరసనలు తెలుపుతామని చెప్పారు. గత ఏడాది మిగిలిన 5లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యా న్నీ కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశా రు. ప్రతి గింజా కొంటామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్ప డం సంతోషకరమన్నారు. నామా మాట్లాడుతూ.. రైతులపై చిత్తశుద్ధి ఉంటే ఇతర పార్టీల ఎంపీలు తమతో పాటు నిరసనల్లో కలిసి రావాలని పిలుపునిచ్చారు. పంట మొత్తం కొంటామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారని, అదే విషయాన్ని పార్లమెంటులో ప్రకటన చేయాలని డి మాండ్‌ చేశారు. కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌.. పంట మొత్తం కొనబోమని చెబుతుండగా.. కిషన్‌రెడ్డి కొంటామని అంటున్నారని చెప్పారు.

Advertisement
Advertisement