Abn logo
Sep 26 2020 @ 00:27AM

స్మార్ట్‌ టీవీ కొంటున్నారా? ఈ టెక్నాలజీలు ఉన్నాయా..

Kaakateeya

స్మార్ట్‌ టీవీ కొనాలనుకునే వారికి ఈ మధ్యకాలంలో అనేక కొత్త పదాలు వినిపిస్తున్నాయి. డాల్బీ విజన్‌, HDR 10, HLG అనే పదాలను వింటున్నారు.  వాటిలో ఏది మెరుగైనదో అర్థం కాక గందరగోళానికి గురవుతున్నారు. చివరకు ఏదో ఒక టీవీ సెలెక్ట్‌ చేసుకుంటున్నారు. అయితే, సంబంధిత టెక్నాలజీలపై కచ్చితమైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మెరుగైన టీవీ mp 3 తీసుకోవటానికి సాధ్యపడుతుంది.


ఒక మామూలు 4కె రిజల్యూషన్‌ కలిగిన టీవీ ప్యానల్‌కి, HDR సపోర్ట్‌ ఉన్న దానికీ దృశ్య నాణ్యత విషయంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. HDR టీవీ ప్రధానంగా నాలుగు అంశాల్లో మెరుగైన ఫలితాలు కలిగి ఉంటుంది. లూమినెన్స్‌ అనే ప్రమాణాన్ని చూసుకుంటే, మామూలు టీవీ గరిష్ఠంగా 100 నిట్స్‌ మాత్రమే బ్రైట్నెస్‌ అందించగలుగుతుంది. అదే HDR టీవీ గరిష్ఠంగా 500 నిట్స్‌ బ్రైట్నెస్‌ ఇస్తుంది. అంతే కాదు, డైనమిక్‌ రేంజ్‌ కూడా విస్తృతంగా ఉంటుంది. టీవీ మీద ఒక దృశ్యాన్ని చూసేటప్పుడు డార్క్‌ బ్లాక్‌, బ్రైట్‌ వైట్‌ రంగులకు మధ్య ఉండే కాంట్రాక్ట్‌ను డైనమిక్‌ రేంజ్‌ అని పిలుస్తారు. HDR టీవీల్లో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక టీవీలో మనకు గరిష్ఠంగా ఎన్ని రంగులు కనిపిస్తాయన్నది కూడా అతి ముఖ్యమైన అంశం. దీనినే సాంకేతిక పరిభాషలో కలర్‌ గామట్‌ అంటారు. HDR టీవీల్లో భారీ మొత్తంలో రంగులకి సపోర్ట్‌ ఉంది. దాంతో ఆ టీవీతో మనం చూసే దృశ్యాలు చాలా సహజసిద్ధంగా కనిపిస్తుంటాయి. అన్నిటికంటే చివరిది, బిట్‌ డెప్త్‌! స్ర్కీన్‌ మీద ఉండే ప్రతి పిక్సెల్‌ బ్రైట్‌ నెస్‌, రంగుల కోసం ఎంత మొత్తంలో డేటా వినియోగిస్తున్నారు అన్నది ఈ ప్రమాణంలో సూచిస్తూ ఉంటారు. ఏఈఖ సపోర్టు కలిగిన టీవీల్లో ఒక్కో రంగులో భారీగా వెయ్యి వరకూ షేడ్స్‌ లభిస్తుంటాయి. ఇంతవరకు చెప్పిన అన్ని రకాల లక్షణాలు కలిసి మామూలు దాని కంటే HDR సపోర్ట్‌ కలిగిన టీవీ మరింత అద్భుతమైన దృశ్య నాణ్యత అందిస్తుందన్న విషయం ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది.


HDR 10 వల్ల ఉపయోగం?

అయితే ఇటీవలి కాలంలో వస్తున్న దాదాపు అన్ని టీవీలు HDRని సపోర్ట్‌ చేస్తున్నప్పటికీ, అందులో మళ్ళీ HDR 10, డాల్బీ విజన్‌, HDR 10 + వంటి పలు ప్రమాణాలు ఉంటాయి. HDR టీవీ ప్రతీ దానిలో ప్రాథమికంగా ఉండే స్టాండర్డ్‌. ఇది ఓపెన్‌ స్టాండర్డ్‌ కావడంతో టీవీ తయారీ కంపెనీలు దీన్ని ఉచితంగా వాడుకోవచ్చు. అందుకే చాలామంది టీవీ తయారీదారులు దీనిని వాడుతూ ఉంటారు. మీరు కొనుగోలు చేసే టీవీ మీద ఏఈఖ అని పేర్కొని ఉండి, దాంట్లో మళ్ళీ ఎలాంటి ఇతర పదాలు లేనట్లయితే అది HDR 10 స్టాండర్డ్‌కు చెందిన టీవీ అని భావించాలి. HDR 10లో 10-బిట్‌ కలర్‌ డెప్త్‌ లభిస్తుంది. గరిష్ఠంగా 1000 నిట్స్‌ బ్రైట్నెస్‌ అందుతుంది. అయితే ఈ టెక్నాలజీలో ఉండే అతి పెద్ద లోపం ‘స్టాటిక్‌ మెటాడేటా’! మీరు చూడబోతున్న ప్రోగ్రాం మొత్తానికి మీ టీవీ ఒకటే ఎక్స్‌పోజర్‌ లెవెల్‌ ఎంపిక చేసుకొని, అదే స్థాయిలో ప్రోగ్రాం మొత్తం చూపిస్తుంది. దీంతో అందులోని వెలుతురు తక్కువగా ఉన్నవి అలాగే బాగా ఉన్నవి తగినంత ఎక్స్‌పోజర్‌ లభించక ప్రోగ్రాం పేలవంగా ఉంటుంది.


డాల్బీ విజన్‌ గురించి!

ఏఈఖ టెక్నాలజీలో అన్నిటికంటే ఎక్కువ ప్రమాణాలను ఇది అందిస్తుంది. ఇది గరిష్ఠంగా 12 బిట్‌ కలర్‌ డెప్త్‌ అందిస్తుంది. గరిష్టంగా అరవై ఎనిమిది బిలియన్‌ రంగులు లభిస్తాయి. అంతేకాదు, అనూహ్యంగా 4000 నిట్స్‌ వరకూ బ్రైట్నె్‌సను ఇది అందించగలుగుతుంది. అయితే ఇక్కడ డాల్బీ విజన్‌ ఆధారంగా పనిచేసే టీవీలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఒకవేళ భవిష్యత్తు వచ్చినా కూడా పైన చెప్పిన విధంగా గరిష్ఠ ప్రమాణాలకు చేరుకోవడం మాత్రం అసాధ్యం. ముఖ్యంగా డాల్బీ విజన్‌లో ఛీజీుఽ్ఛ డైనమిక్‌ మెటా డేటా వాడతారు. స్ర్కీన్‌ మీద ప్రదర్శించే ప్రోగ్రాంలో ప్రతీ ఫ్రేమ్‌ని పరిగణనలోకి తీసుకొని దానికి తగ్గట్టు అప్పటికప్పుడే ఎక్స్పోజర్‌ మార్పిడి అవుతుంది. కచ్చితంగా ఇది మెరుగైన ఫలితాలను అందిస్తుంది. అయితే ఈ తరహా డాల్బీ విజన్‌ టీవీలు కొనుగోలు చేయాలంటే చాలా ఖర్చు పెట్టాలి. దీనికి ప్రధాన కారణం, ఈ టెక్నాలజీ డాల్బీ సంస్థకు చెందినది. టీవీ తయారీ కంపెనీలు మొదలుకొని, డాల్బీ విజన్‌ టెక్నాలజీ ఆధారంగా కంటెంట్‌తో తయారు చేసే ప్రొడ్యూసర్లు ముఖ్యంగా ఆ సంస్థకు లైసెన్సింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.


HDR 10+ కొత్తగా!

ఇంతకు ముందు మనం చెప్పుకొన్న HDR 10కి కొనసాగింపుగా వచ్చిన ఓపెన్‌ స్టాండర్డ్‌ ఇది. HDRలో మనం ప్రధానమైన లోపం స్టాటిక్‌ మెటాడేటా అని చెప్పుకొన్నాం కదా. అయితే ఆ లోపాన్ని సరి చేస్తూ ఈ టెక్నాలజీలో డైనమిక్‌ మెటా డేటా అందిస్తున్నారు. ఈ కారణంతో కొంతవరకు డాల్బీ విజన్‌ స్థాయి దృశ్య నాణ్యత లభించినప్పటికీ, బిట్‌ డెప్త్‌, గరిష్ఠ బ్రైట్నెస్‌ విషయంలో HDR 10+ కూడా డాల్బీ విజన్‌ కంటే వెనకబడే ఉంటుంది. HDR 10+లో 10 బిట్‌ కలర్‌ డెప్త్‌, గరిష్ఠంగా 1000 నిట్స్‌ బ్రైట్నెస్‌ మాత్రమే లభిస్తుంది. ఇకమీదట మార్కెట్లోకి వచ్చే ఎక్కువ టీవీలు ఏఈఖ+ ప్రమాణాన్ని కలిగి ఉండొచ్చు.

HLG అని మరొకటి

కొన్నిసార్లు టీవీ కొనేటప్పుడు HLG అనే పదం కూడా కనిపిస్తూ ఉంటుంది. ‘హైబ్రిడ్‌ లాగ్‌ గామా’ అనే పదానికి సంక్షిప్త రూపం ఈ HLG. వాస్తవానికి ఇది పైన చెప్పిన HDR ప్రమాణం కాదు. HDR, మామూలు రకం టీవీల మధ్య వ్యత్యాసాన్ని సరిచేయడానికి ఉపయోగించే టెక్నాలజీ ఇది. వివిధ సినిమాలు, టీవీ ప్రోగ్రాములు తయారుచేసే ప్రొడ్యూసర్లు HDR టీవీని దృష్టిలో పెట్టుకొని కంటెంట్‌ తయారు చేసినట్లయితే, ఒకవేళ ఆ ప్రోగ్రాంని HDR సదుపాయం లేని మామూలు టీవీలో చూసినప్పుడు కలర్‌ శాట్యురేషన్‌తో పిక్చర్‌ క్వాలిటీ నష్టపోవాల్సి వస్తుంది. వాస్తవానికి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక బ్లూ-రే ప్లేయర్లు, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి స్ర్టీమింగ్‌ సర్వీసులు మామూలు టీవీల కోసం ప్రత్యేకంగా HDR కోవకు చెందని కంటెంట్‌ కూడా అందిస్తుంటాయి. అయితే టీవీ ప్రసారాల విషయంలో ఇలా రెండు వెర్షన్లు అందించడం కష్టంగా ఉంటుంది కాబట్టి, అలాంటప్పుడు HLG ఉపయోగపడుతుంది. టీవీ కోసం ప్రసారాలు అందించే సంస్థలు విడివిడిగా రెండు స్ర్టీమ్‌లు అందించాల్సిన అవసరం లేకుండా కేవలం ఒకే ఒక HLG స్ర్టీమ్‌ అందిస్తే సరిపోతుంది. అది HDR టీవీల్లో వాటికి తగ్గట్టు ప్లే అవుతుంది, HDR సదుపాయం లేని టీవిల్లో మరో విధంగా ప్లే అవుతుంది.

ఎలాంటి HDR టీవీ కొనాలి?

ఇంతకుముందే చెప్పుకొన్నట్లు అద్భుతమైన దృశ్య నాణ్యత కావాలంటే అన్నిటికంటే ఉత్తమమైనది ‘‘డాల్బీ విజన్‌’’ ప్రమాణం. కొద్దిగా ఎక్కువ   అయినా దాన్ని కొనుగోలు చేయటం ద్వారా దృశ్య నాణ్యత మెరుగ్గా ఉంటుంది. అయితే కేవలం మీ దగ్గర డాల్బీ విజన్‌ టీవీ ఉన్నంత మాత్రాన సరిపోదు, మీరు ఉపయోగిస్తున్న బ్లూరే ప్లేయర్‌, సెట్‌ టాప్‌ బాక్స్‌, గేమింగ్‌ కన్సోల్‌ వంటివి తప్పనిసరిగా డాల్బీ విజన్‌ సపోర్ట్‌ కలిగి ఉండాలి. ఆ టెక్నాలజీలో ఉత్పత్తి చేసిన వీడియోలు మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే దాని ద్వారా మీకు గరిష్ఠ ప్రయోజనం లభిస్తుంది. డాల్బీ విజన్‌ తరవాత, HDR 10+ సపోర్ట్‌ కలిగిన మోడల్‌ ఉంటే ఎంపిక చేసుకోవచ్చు. HDR 10తో పోలిస్తే ఇది కచ్చితంగా మెరుగ్గా ఉంటుంది. ఇక ఎలాంటి మార్గం లేదు అనుకుంటే అప్పుడు మాత్రమే మామూలు HDR 10ని సెలెక్ట్‌ చేసుకోవాలి. ఇప్పుడు వస్తున్న దాదాపు అన్ని రకాల 4K టీవీలు HDR 10ని సపోర్ట్‌ చేస్తున్నాయి. కాబట్టి వాటిని గుర్తించే విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

- నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothu sridhar

Advertisement
Advertisement
Advertisement