Abn logo
Sep 22 2021 @ 01:34AM

‘ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం అనైతిక చర్య’

చౌటుప్పల్‌లో విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

చౌటుప్పల్‌ టౌన, సెప్టెంబరు 21: ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయ డం అనైతిక చర్య అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. చౌటుప్పల్‌లోని రాజీవ్‌భవనలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించిన  చండూరు మునిసిపల్‌ చైర్మనను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు మంత్రి జగదీష్‌రెడ్డి బేరసారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇప్పటికే  అధి కారంతో, అవినీతి డబ్బుతో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీపీ, జడ్పీ టీసీలను కొనుగోలు చేశారని, నైతిక విలువలకు తిలోదాకాలు ఇచ్చిన మంత్రి జగదీష్‌రెడ్డికి సూర్యాపేటలో ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. మునుగోడు నియోజకవర్గానికి దళితబంధుకు రూ.2 వేల కోట్లు కేటాయిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో పాటు రాజకీయ సన్యాసం చేస్తానని కోమ టిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ ను ఓడించాలన్న కక్షతోనే ‘దళిత బంధు’ పథకాన్ని కేసీ ఆర్‌ తెచ్చారన్నారు. చౌటుప్పల్‌ చెరువు అలుగు నీరు సాపీగా వెళ్లేందుకు శాశ్విత పరిష్కారం చేయాలని ఏడాది క్రితం కోరినా ప్రభుత్వం స్పందించ లేదన్నారు. చౌటుప్పల్‌ మునిసిపాలిటీకి రూ.100 కోట్లు, చండూరుకు రూ. 50 కోట్లు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.అన్నారు. పరిశ్రమల కాలుష్యం నుంచి చౌటుప్పల్‌ ప్రాంతాన్ని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు, మూసీ కాల్వ లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.  కరోనా సమయంలో రూ.5కోట్ల  కోట్ల విలువైన నిత్యవసర సరుకులు, రూ.10కోట్లను పేదలకు సాయంగా అందజేశానన్నారు. ఈ సమావేశంలో వైస్‌ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, బ్లాక్‌, మండల, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు ఉబ్బు వెంకటయ్య, బక్క శ్రీనాథ్‌ ,ఎం. రమేష్‌ గౌడ్‌, కౌన్సిలర్‌ కొయ్యడ సైదులులు పాల్గొన్నారు. ముందుగా పట్టణంలో చెరువు అలుగు నీటి ముంపుకు ప్రాంతాలను పరిశీలించారు.  

 గ్రామాల్లో మద్యపానాన్ని నిషేధించాలి

సంస్థాన నారాయణపురం: గ్రామాల్లో మద్యపానాన్నినిషేధించాలని  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారు. తన తల్లి సుశీలమ్మ ఫౌండే షన నిధులు రూ.6.47లక్షలతో మండలంలోని అల్లందేవిచెర్వులో నిర్మించిన భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మునుగోడు నియోజక వర్గంలో మొదటిసారిగా మద్యపాన నిషేధ ం అమలు చేయడంతో అల్లం దేవిచెర్వు గ్రామం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ సుర్వి యాదయ్య, పంచాయతీ కార్యదర్శి పాషా, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కరంటోతు శ్రీను, మందుగుల బాలకృష్ణ,  ఉప్పల లింగస్వామి, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.