ఆన్‌లైన్‌లో కొంటున్నారా?

ABN , First Publish Date - 2020-09-09T05:30:00+05:30 IST

కరోనా విజృంభిస్తుండడంతో ఎక్కువ మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విధానం సురక్షితమే అయినా డెలివరీ ఏజెంట్ల ద్వారా, వాటి ప్యాకింగ్‌ ద్వారా కరోనా సోకే వీలుంది.

ఆన్‌లైన్‌లో కొంటున్నారా?

కరోనా విజృంభిస్తుండడంతో ఎక్కువ మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విధానం సురక్షితమే అయినా డెలివరీ ఏజెంట్ల ద్వారా, వాటి ప్యాకింగ్‌ ద్వారా కరోనా సోకే వీలుంది. అలా జరగకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

నో కాంటాక్ట్‌ డెలివరీ కోసం ఆన్‌లైన్‌ పేమెంట్‌ ప్రత్యామ్నాయం ఎంచుకోవాలి. ఇలాంటి ఆప్షన్‌ కలిగి ఉన్న ఆన్‌లైన్‌ స్టోర్లనే షాపింగ్‌కు ఎంచుకోవాలి.

డెలివరీ బాయ్‌ తెచ్చే ఆర్డర్‌ ప్యాకేజీలను చేత్తో అందుకోకూడదు. వాటిని ఉంచడం కోసం వాకిలి బయట ఒక స్టూలు ఏర్పాటు చేయాలి. 

స్టూలు మీద ఉంచిన ప్యాకేజీ మీద శానిటైజర్‌ స్ర్పే చేసి, రెండు గంటల తర్వాత దాన్ని అందుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒకవేళ ప్యాకేజీ మీద వైరస్‌ ఉన్నా, దాని తీవ్రత తగ్గడంతో పాటు, అది ఇంట్లోని  ఉపరితలాల మీదకు చేరకుండా ఉంటుంది. 

ఠి ప్యాకేజీ అందుకుని, ఊడదీసి, తిరిగి ఖాళీ ప్యాకెట్‌ను చెత్తబుట్టలో వేసిన తర్వాత కనీసం రెండు నిమిషాల పాటు చేతులను సబ్బునీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. 

Updated Date - 2020-09-09T05:30:00+05:30 IST